Andhra Pradesh Farmers Drones 80 Percent Discount: రైతులకు వ్యవసాయంలో సహాయపడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్లను సబ్సిడీపై అందిస్తోంది. 80% సబ్సిడీతో రైతు గ్రూపులకు డ్రోన్లు ఇస్తున్నారు. దీని ద్వారా పురుగు మందులు పిచికారీ చేయడం, విత్తనాలు వేయడం సులభమవుతుంది. కూలీల కొరతను అధిగమించి తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయొచ్చు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ డ్రోన్ పథకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
- ఏపీ రైతులకు ప్రభుత్వం అద్భుత అవకాశం
- 80శాతం రాయితీతో డ్రోన్లను అందజేస్తోంది
- ఐదుగురు రైతులు కలిసి ఒక సంఘం

ఒక్కో డ్రోన్ ధర రూ.9.80 లక్షలుకాగా.. బ్యాంకు రుణం ద్వారా రూ.4.90 లక్షలు ఇస్తారు. రైతులు రూ.4.90 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం సబ్సిడీగా రూ.7.84 లక్షలు తిరిగి ఇస్తుంది. అప్పుడు రైతుకు ఈ డ్రోన్ దాదాపు రూ.2లక్షలకే (రూ.1,96,000)కే లభిస్తుంది. ఈ డ్రోన్ కోసం రైతులు కనీసం ఐదుగురు కలిసి ఒక గ్రూపు ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి కనీసం 10వ తరగతి వరకు చదివి ఉండాలి, ఐటీఐ చేసి ఉండాలి. అప్పుడు సదరు రైతుకు డ్రోన్‌తో ఎలా పని చేయాలి, దాని నిర్వహణ ఎలా, ఎరువులు, మందులు ఎలా పిచికారీ చేయాలి అనేది తెలుస్తుంది. అలా ఒక రైతును సెలక్ట్ చేసి 12 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అ లా శిక్షణ పొందిన రైతు మాత్రమే డ్రోన్‌తో పని చేయాలి.. ఈ మేరకు దీనికి సంబంధించిన నిబంధనలతో ఒక హామీ పత్రం కూడా ఇస్తారు.
సీఎం కారులో.. సీఎంతో కలిసి.. దళితుడి ప్రయాణం
రైతులు గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ అనుమతితో మరిన్ని డ్రోన్లను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ డ్రోన్ల వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవచ్చు. కూలీల కొరతను అధిగమించవచ్చు.. పెట్టుబడి కూడా ఒక సీజన్లోనే తిరిగి వస్తుంది. డ్రోన్ తీసుకున్న గ్రూప్ సభ్యులు తమ పొలాలతో పాటు ఇతరుల పొలాల్లో కూడా డ్రోన్లతో పని చేయవచ్చు. దీని ద్వారా రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదించవచ్చు. ముఖ్యంగా కూలీల కొరత ఉన్న ఈ రోజుల్లో డ్రోన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. “ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.