Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra News: ఎంత విషాదం..పెంచలేక పేగుబంధాన్ని విక్రయించిన కన్నతల్లి!

12 July 2025

Dharmana Prasad: మౌనం వీడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వం, పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు!

12 July 2025

Ram Mohan Naidu: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏమన్నారంటే?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kanipakam Temple Milk,కాణిపాకం ఆలయంలో అపచారం.. పాపం ఆ భక్తురాలు ఆశగా వెళితే, ఆ పాలతో ఎలా.. ఏం జరిగిందంటే – kanipakam temple eo serious on damaged milk issue
ఆంధ్రప్రదేశ్

Kanipakam Temple Milk,కాణిపాకం ఆలయంలో అపచారం.. పాపం ఆ భక్తురాలు ఆశగా వెళితే, ఆ పాలతో ఎలా.. ఏం జరిగిందంటే – kanipakam temple eo serious on damaged milk issue

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kanipakam Temple Milk,కాణిపాకం ఆలయంలో అపచారం.. పాపం ఆ భక్తురాలు ఆశగా వెళితే, ఆ పాలతో ఎలా.. ఏం జరిగిందంటే – kanipakam temple eo serious on damaged milk issue
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Kanipakam Temple Damaged Milk: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పాలాభిషేకం కోసం తెచ్చిన పాలు విరిగిపోవడంతో కలకలం రేగింది. భక్తురాలు సమర్పించిన 10 లీటర్ల పాలు పనికిరావని గుర్తించి, ఈవో పెంచల కిషోర్ వాటిని పారబోయించారు. పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్నారు.. మరోసారి ఈ తప్పు జరగదు అన్నారు. తిరుమల తరహాలో ఉచిత సేవలు ప్రారంభించాలని, భక్తులకు మెరుగైన సేవలు అందించాలని దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ నిర్ణయించారు.

హైలైట్:

  • కాణిపాకం ఆలయంలో అపచారం
  • పాపం ఆ భక్తురాలు ఆశగా వెళితే
  • కాంట్రాక్టర్ తీరుపై ఈవో ఆగ్రహం
కాణిపాకం ఆలయం పాలు
కాణిపాకం ఆలయం పాలు (ఫోటోలు– Samayam Telugu)

చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో అపచారం జరిగింది. బుధవారం సాయంత్రం పాలాభిషేకానికి తెచ్చిన పాలు విరిగిపోయాయి. ఒక భక్తురాలు స్వామికి సమర్పించడానికి 10 లీటర్ల పాలు తీసుకురాగా.. అవి పనికిరావని అర్చకులు గుర్తించారు. ఈ విషయం ఈవో పెంచల కిషోర్‌కు తెలియడంతో ఆ పాలను బయట పారబోయించారు. అలాగే పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్నారు. ఆలయంలో ప్రతిరోజు పాలాభిషేకాలు జరుగుతాయి. భక్తులు టికెట్ కొనుక్కొని స్వామికి పాలాభిషేకం చేస్తారు. ఈ క్రమంలో పాలు విరిగిపోయాయి. పాపం ఆ భక్తురాలు స్వామివారికి అభిషేకం చేద్దామని ఆశగా వెళితే ఇలా జరిగిందేంటని చర్చ జరిగింది.భక్తులకు అందించే పాల విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈవో పెంచల కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆలయం దగ్గర పాలాభిషేకానికి పాలు విక్రయించొద్దని కాంట్రాక్టును రద్దు చేశారు. ఆలయానికి పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లు స్వామికి స్వచ్ఛమైన పాలను అందించాలన్నారు. మరోసారి కాణిపాకం ఆలయం దగ్గర ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు ఈవో. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

దక్షిణ భారతదేశంలో చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయం ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయంలో శివుడు, పార్వతిల కుమారుడైన గణేశుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. వినాయకుడి విగ్రహం ఎప్పుడూ నీటిలో ఉంటుంది. అంతేకాదు, రోజురోజుకీ పెరుగుతూ ఉంటుందని భక్తులు నమ్ముతారు. నిత్యం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే స్వామివారికి పాలతో అభిషేకం చేస్తుంటారు. ఈ క్రమంలోనే పాలు విరిగిపోవడం కలకలం రేపింది.

శ్రీశైలం నుంచి సాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు.. జలహారతి ఇచ్చిన సీఎం

తిరుమల తరహాలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఉచిత సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆలయ అభివృద్ధిపై జరిగిన సమీక్షలో దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సేవకుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని.. క్యూలైన్లు, అన్నదానం వంటి చోట్ల వారి సేవకుల ద్వారా సేవలను వినియోగిస్తారన్నారు. కాణిపాకం ఆలయంలో ఉచితంగా సేవ చేసేవారికి వసతులు కల్పిస్తామని.. దీనివల్ల భక్తులకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు.. ఆలయ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది అన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి