Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Dharmana Prasad: మౌనం వీడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వం, పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు!

12 July 2025

Ram Mohan Naidu: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏమన్నారంటే?

12 July 2025

Instagram Shopping Scam: ఇన్‌ స్టాగ్రామ్ లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Parent Teacher Meeting In Ap,గురుపౌర్ణమి రోజు పున్నమి చంద్రుని దర్శనం చేసుకున్నా.. చంద్రబాబును చూసి మహిళ ఎమోషనల్ – woman gets emotional on stage after seeing cm chandrababu at kothacheruvu mega parents meeting
ఆంధ్రప్రదేశ్

Parent Teacher Meeting In Ap,గురుపౌర్ణమి రోజు పున్నమి చంద్రుని దర్శనం చేసుకున్నా.. చంద్రబాబును చూసి మహిళ ఎమోషనల్ – woman gets emotional on stage after seeing cm chandrababu at kothacheruvu mega parents meeting

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Parent Teacher Meeting In Ap,గురుపౌర్ణమి రోజు పున్నమి చంద్రుని దర్శనం చేసుకున్నా.. చంద్రబాబును చూసి మహిళ ఎమోషనల్ – woman gets emotional on stage after seeing cm chandrababu at kothacheruvu mega parents meeting
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Chandrababu at Kothacheruvu PTM: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. కొత్తచెరువులో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌‍లో భాగంగా విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ మహిళ చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది. సీఎం చంద్రబాబును చూడగానే గురుపౌర్ణమి రోజు పున్నమి చంద్రుణ్ని దర్శించుకున్నానంటూ ఆ మహిళ ఎమోషనల్ అయ్యింది.

కొత్తచెరువు మెగా పేరెంట్స్ మీటింగ్
కొత్తచెరువు మెగా పేరెంట్స్ మీటింగ్ (ఫోటోలు– Samayam Telugu)

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. సత్యసాయి జిల్లా కొత్తచెరువు జిల్లాపరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం -2.0 ( మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0) కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో చంద్రబాబుతో పాటుగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఓ మహిళ సీఎం చంద్రబాబు నాయుడును చూసి ఎమోషనల్ అయ్యారు. తల్లికి వందనం పథకం, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో చంద్రబాబు పేదవారికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆ తర్వాత చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందరి తల్లుల తరుఫున.. తాను చంద్రబాబు కాళ్లకు నమస్కరిస్తున్నానంటూ ఎమోషనల్ అయ్యారు. గురుపౌర్ణమి రోజున పున్నమి చంద్రుని దర్శనం చేసుకున్నానంటూ సంతోషపడ్డారు. ముఖ్యమంత్రి ముందు మాట్లాడాలని ఎంతో ప్రిపేర్ అయ్యి వచ్చానని.. కానీ ఏమీ మాట్లాడలేకపోతున్నానని క్షమించండి సార్ అంటూ ఆ మహిళ భావోద్వేగానికి గురయ్యారు.మరోవైపు గురువారం (జూలై 10) రెండు తెలుగు రాష్ట్రాలలో గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ పర్వదినం విశిష్టతను గుర్తులో పెట్టుకునే ఏపీ ప్రభుత్వం కూడా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఈ రోజు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కొత్తచెరువు జిల్లాపరిషత్ పాఠశాలలరో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలనే తన ఆలోచన ఇప్పటిది కాదని అన్నారు. 1998లోనే ఈ ఆలోచన చేశానని గుర్తు చేసుకున్నారు. స్కూళ్లల్లో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నవారు.. తాము చదువుకున్న స్కూళ్లకు ఎంతో కొంత తిరిగివ్వాలని చంద్రబాబు సూచించారు. తల్లీ, తండ్రి తర్వాతి స్థానం గురువులదని.. జీవితంలో ఎవరిని మరిచిపోయినా, విద్యాబుద్ధులు చెప్పిన గురువులను మాత్రం మరిచిపోలేమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయాలలో బిజీగా ఉన్నందున నారా లోకేష్ చిన్నప్పుడు ఎప్పుడూ కూడా తాను పేరెంట్స్‌ మీటింగ్‌కు వెళ్లలేకపోయానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

టీచర్‌గా మారిన చంద్రబాబు.. పిల్లలకు పాఠాలు.. లోకేష్ కూడా శ్రద్ధగా

పిల్లలను బాగా చదివించుకోవాలనే ఉద్దేశంతోనే తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్న చంద్రబాబు.. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ చదివించినా, వారి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విద్యార్థులకు స్కూళ్లకు వస్తున్నారో లేదో తెలుసుకునేందుకు యాప్ తెచ్చామని.. స్కూలుకు రాకపోతే తల్లిదండ్రులకు వెంటనే తెలిసిపోతుందన్నారు. మెగా పేరెంట్స్‌ మీటింగ్‌ ద్వారా.. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పామని చంద్రబాబు ప్రకటించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి