Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

బీ అలెర్ట్.. వర్షాకాలంలో మీరు ఈ తప్పులు చేస్తున్నారా..? జబ్బులు వస్తాయి జాగ్రత్త..!

12 July 2025

Actress : మూడేళ్లుగా సినిమాలకు దూరం.. అయినా తగ్గని క్రేజ్.. కుర్రాళ్ల కలల రాకుమారి ఎవరో గుర్తుపట్టారా.. ?

12 July 2025

Fee Reimbursement In Ap 2025,ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు.. నిధులు విడుదల.. – ap government release 600 crore in fee reimbursement funds for students

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Swachh Andhra,చెత్త వేయండి.. ఉచితంగా సరుకులు పట్టుకెళ్లండి.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్ – ap government to provide free essential commodities to garbage and waste through swachh ratham
ఆంధ్రప్రదేశ్

Swachh Andhra,చెత్త వేయండి.. ఉచితంగా సరుకులు పట్టుకెళ్లండి.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్ – ap government to provide free essential commodities to garbage and waste through swachh ratham

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Swachh Andhra,చెత్త వేయండి.. ఉచితంగా సరుకులు పట్టుకెళ్లండి.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్ – ap government to provide free essential commodities to garbage and waste through swachh ratham
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Swachh Ratham Pilot project in Prathipadu: స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం స్ఫూర్తిని పల్లెలకు సైతం విస్తరింపజేసేందుకు కొత్త ఆలోచన చేసింది. అందులో భాగంగా స్వచ్ఛ రథం కార్యక్రమానికి ఏపీ పంచాయతీరాజ్ శాఖ శ్రీకారం చుట్టింది. గుంటూరు గ్రామీణం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. స్వచ్ఛ రథం వద్ద చెత్త అందించిన వారికి.. ఆ చెత్తకు సమానమైన నిత్యావసర సరుకులను ఉచితంగా అందిస్తారు.

ఏపీ ప్రభుత్వం స్వచ్ఛ రథం
ఏపీ ప్రభుత్వం స్వచ్ఛ రథం (ఫోటోలు– Samayam Telugu)

ప్రజలకు ఆరోగ్యవంతమైన, సౌకర్యవంతమైన జీవనం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛభారత్ కార్యక్రమం స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రవేశపెట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అరికట్టాలనే ఉద్దేశంతో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెల మూడో శనివారం మున్సిపాలిటీలు, పట్టణాలలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపడుతున్నారు. అయితే స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లెల్లోకి కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏపీ పంచాయతీరాజ్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగా స్వచ్ఛ రథాలను తీసుకువచ్చారు. ఈ స్వచ్ఛ రథం ద్వారా పల్లె ప్రాంతాల్లో చెత్త, వ్యర్థాలను సేకరిస్తారు. ప్రజలు ఎంతమేర చెత్త, వ్యర్థాలను తీసుకువచ్చారో లెక్కగట్టి.. అందుకు సమానంగా 20 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని తొలుత గుంటూరు గ్రామీణ మండలంలో అమలు చేస్తున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ హెని క్రిస్టినా గుంటూరు గ్రామీణ మండలం లాలుపురం పంచాయతీలో వీటిని ప్రారంభించారు.

స్వచ్ఛ రథం కాన్సెప్టులో భాగంగా.. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ స్వచ్ఛ రథం మండలంలోని అన్ని గ్రామాలను చుట్టివస్తుంది. స్వచ్చ రథం ఇంటి వద్దకు వచ్చిన సమయంలో ప్రజలు తమ ఇళ్లల్లోని తడి, పొడి చెత్తను వాటికి కేటాయించిన డబ్బాలలో వేయాలి. ఆ వ్యర్థాల బరువును లెక్కగట్టి వాటికి సమానమైన నిత్యావసరాలు ఉచితంగా అందిస్తారు. చెత్త, వ్యర్థాల రకాన్ని అనుసరించి కిలోకి రూ. 16 నుంచి రూ. 20 వరకు లెక్కించనున్నారు. ఎన్ని కిలోలు బరువు తూగితే.. ఆ లెక్కన లెక్కగట్టి అందుకు సమానంగా నిత్యావసర వస్తువులు అందిస్తారు. గాజు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు, పాత పేపర్లు, ప్యాకెట్లు, కవర్లు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వంటి వాటిని స్వచ్ఛరథం సిబ్బందికి అందించి.. నిత్యావసరాలు తీసుకోవచ్చు.పల్లెలలో కూడా స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతో ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఈ సరికొత్త ఆలోచన చేసింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి