అనంతపురం జిల్లా ప్రజలకు గమనిక! జూలై 11న కదిరిదేవరపల్లి-తిరుపతి రైలు రద్దు చేశారు. రాయదుర్గం-సోమలాపురం మధ్య ట్రాక్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, జూలై 12 నుండి రైలు యథావిధిగా నడుస్తుందని అధికారులు తెలిపారు. తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ మార్పును గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కదిరిదేవరపల్లిలో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరే ఈ రైలు.. మరుసటి రోజు ఉదయం 3 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. దాదాపు 536 కి.మీ. దూరాన్ని 12 గంటల 25 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 44 స్టేషన్లలో ఆగుతుంది, గుంతకల్, ధర్మవరం జంక్షన్‌లలో ఎక్కువ సమయం ఆగుతుంది. కదిరిదేవరపల్లి తిరుపతి రైలు ప్యాసింజర్ కావటంతో.. తిరుపతికి వెళ్లాలనుకునే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈ రైలు ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అనంతపురం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
మరోవైపు అనంతపురం జిల్లా నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువ మంది కదిరిదేవరపల్లి తిరుపతి ప్యాసింజర్ రైలు ద్వారా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అలాగే తిరుపతి నుంచి తిరిగి వచ్చేందుకు కూడా ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అయితే ట్రాక్ పనుల నేపథ్యంలో జూలై 11న కదిరిదేవరపల్లి – తిరుపతి రైలు రద్దు చేశారు. దీంతో ఆ రోజు తిరుపతికి ప్రయాణాలు ప్లాన్ చేసుకున్న వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. జూలై 12 నుంచి యథావిధిగా ఈ రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
మరోవైపు అనంతపురం బెంగళూరు మధ్య ఇటీవల ప్యాసింజర్ రైలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి ఉన్న రైలును అనంతపురం వరకూ పొడిగించారు. దీంతో కేవలం రూ.50 లతోనే బెంగళూరుకు వెళ్లే వెసలుబాటు ఈ ప్రాంతవాసులకు కలిగింది. దీంతో అనంతపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.