Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Child Artist: ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఆ స్టార్ హీరో సరసన హీరోయిన్‏గా..

12 July 2025

Jaipur Lakes: జైపూర్‎లోని ఈ 5 సరస్సులు హృదయాలను ఆకట్టుకుంటాయి.. కచ్చితంగా చూడాలి..

12 July 2025

Tollywood: ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. పెళ్లైన 15 రోజులకే వదిలేసిన భర్త.. ఇప్పుడేం చేస్తుందంటే..

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ktr Ap Bjp Madhav Lokesh Telangana Map,నారా లోకేష్‌కు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చిత్రపటం బహూకరణ.. కేటీఆర్ అభ్యంతరం, మోదీకి ట్వీట్ – brs working president ktr tweet to pm modi over ap bjp chief madhav india map gift to nara lokesh
ఆంధ్రప్రదేశ్

Ktr Ap Bjp Madhav Lokesh Telangana Map,నారా లోకేష్‌కు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చిత్రపటం బహూకరణ.. కేటీఆర్ అభ్యంతరం, మోదీకి ట్వీట్ – brs working president ktr tweet to pm modi over ap bjp chief madhav india map gift to nara lokesh

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ktr Ap Bjp Madhav Lokesh Telangana Map,నారా లోకేష్‌కు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చిత్రపటం బహూకరణ.. కేటీఆర్ అభ్యంతరం, మోదీకి ట్వీట్ – brs working president ktr tweet to pm modi over ap bjp chief madhav india map gift to nara lokesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చేసిన పనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇదేం పని అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని, భౌగోళిక గుర్తింపును గుర్తించకుండా వ్యవహరించారని విమర్శించారు. దీనిపై తెలంగాణ ప్రజానీకానికి బీజేపీ అధిష్ఠానం క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు నారా లోకేష్‌కు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భారతదేశ చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే ఇందులో తెలంగాణ లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూపటంతో విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

నారా లోకేష్‌కు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చిత్రపటం బహూకరణ.. కేటీఆర్ అభ్యంతరం, మోదీకి ట్వీట్
నారా లోకేష్‌కు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చిత్రపటం బహూకరణ.. కేటీఆర్ అభ్యంతరం, మోదీకి ట్వీట్ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. నారా లోకేష్‌కు బహూకరించిన చిత్రపటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఏపీ బీజేపీ చీఫ్ చేసిన పనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీవీఎన్ మాధవ్ ఏపీ బీజేపీ చీఫ్‌గా కొత్తగా నియమితులయ్యారు బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో లోకేష్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారతదేశ చిత్రపటాన్ని మాధవ్ నారా లోకేష్‌కు అందజేశారు. భారతదేశ సాంస్కృతిక వైభవం పేరుతో ఉన్న చిత్రపటాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్.. నారా లోకేష్‌కు అందజేశారు.

అయితే ఈ చిత్రపటంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను వేర్వేరుగా కాకుండా.. కలిపి ఆంధ్రప్రదేశ్‌గా చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ చేసిన పనికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

“సాంస్కృతిక గుర్తింపు, చరిత్రలో సరైన స్థానం, భౌగోళిక గుర్తింపు కోసం తెలంగాణ ప్రజానీకం కొన్ని తరాలు పోరాటం చేసింది. కానీ ఈరోజు, మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను బహుమతిగా ఇచ్చి, తెలంగాణ ఉనికిని విస్మరించారు. దీని ద్వారా మా పోరాటాన్ని తక్కువ చేశారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ పోరాటానికి, అమరవీరుల త్యాగాలు, చరిత్ర పట్ల స్పష్టమైన నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. మా చరిత్రను తుడిచేస్తే, ఇక మేం ఏమిటి?” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Nara Lokesh Inter Students : చెల్లెమ్మా.. నేనున్నా, విద్యార్థినికి లోకేష్ అభయం

ఈ ఘటన బీజేపీ పార్టీ ప్రణాళికను తెలియజేస్తోందా లేదా రాజకీయ ఎజెండాను ప్రతిబింబిస్తుందో స్పష్టం చేయాలని ప్రధానమంత్రి మోదీని కేటీఆర్ కోరారు. తెలంగాణ అస్థిత్వాన్ని, తెలంగాణ భౌగోళిక గుర్తింపును గుర్తించకపోవటం బీజేపీ విధానమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ ఇదే కనుక పొరబాటున జరిగి ఉంటే.. తెలంగాణ ప్రజలను అపహాస్యం చేసినందుకు బీజేపీ అధిష్టానం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్‌ ట్వీట్‌ ద్వారా డిమాండ్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ఫోటో వైరల్ అవుతోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి