
బంగారం ధరలు భగభగమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు షాకిస్తున్నాయి. ఓ రోజు తగ్గి.. మూడు రోజులు పెరుగుతున్నాయి. ఈ ధరలు ఇవాళ కూడా స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 98వేల500 రూపాయిల దగ్గర ట్రేడ్ అవుతుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90వేల200 రూపాయిల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1 లక్షా10వేలుగా ఉంది. ఇవాళ్టి ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 98,400గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 90వేల200 రూపాయిలుగా ఉంది. కిలో వెండి ధర 1లక్షా 20 వేల రూపాయిలుగా ఉంది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.98,320 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.90,140గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,170, 22 క్యారెట్ల ధర రూ.89,990గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,170, 22 క్యారెట్ల ధర రూ.89,990 గా ఉంది. బంగారం అంతర్జాతీయంగా డాలర్లలో ట్రేడవుతుంది. అందువల్ల డాలర్ విలువ పెరిగితే, ఇతర కరెన్సీతో పోలిస్తే బంగారం ధరలు మరింత ఖరీదవుతాయి.
ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరుసటి రోజు స్వల్పంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్‌లో బంగారం ధరలు రాబోయే రోజుల్లో 99 వేల నుంచి లక్ష రూపాయల మధ్య స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొంత మంది నిపుణులు 95 నుంచి ఒక లక్ష రూపాయల మధ్య బంగారం ధరలు స్థిరపడవచ్చని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి