
స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’, ‘లీడర్’, ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ సినిమాలతో టాలీవుడ్ లో ఫీల్ గుడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ములు. ఇప్పుడు ఆయన తొలిసారిగా స్టార్ హీరో సినిమాకు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు.. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. కుబేర సినిమాలో ధనుష్ తో పాటు నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు.
ఇది కూడా చదవండి : అక్క స్టార్ హీరోయిన్.. చెల్లి మాత్రం సినిమాలకు దూరంగా ఇలా.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పుడు కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. కుబేర సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 50 కోట్లకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. అమెజాన్ ప్రైమ్ లో జులై 18న కుబేర సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాగా గతకొన్ని రోజులుగా కుబేర ఓటీటీ రిలీజ్ పై ఎన్నో వార్తలు, రూమర్స్ వచ్చాయి.. ఇప్పుడు సినిమా ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ పైగా అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్.
ఇది కూడా చదవండి : 1000కోట్ల హీరోయిన్.. ఆస్తి పాస్తులకు లెక్కే లేదు.. కానీ చిన్నకారులో తిరుగుతున్నముద్దుగుమ్మ
ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డీఎస్పీ సంగీతంలో ధనుష్ తొలిసారిగా కుబేర చిత్రంలో ఓ పాట పాడడంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా రూ. 200కోట్లకు పైగా వసూల్ చేసిందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ నటన పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల మేకింగ్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. కింగ్ నాగార్జున తొలిసారి డిఫరెంట్ రోల్ లో కనిపించి మెప్పించారు. థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న కుబేర ఓటీటీలో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి :మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.