గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఇటీవల జరిగిన BJP రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా రాజాసింగ్ బీజేపీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జూన్ 30న తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు రాజాసింగ్. మరోవైపు, బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని గతంలోనే రాజాసింగ్ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై గతంలో రాజాసింగ్ అనేక ఆరోపణలు చేశారు. తాజాగా రాజాసింగ్ రాజీనామాను పార్టీ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.