Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Investment: 45 ఏళ్లకే రిటైర్మెంట్.. చిన్న పెట్టుబడితో రూ. 4.7 కోట్లు పోగేసిన సామాన్యుడు సక్సెస్ స్టోరీ..

12 July 2025

World Sanskrit Conference: ప్రపంచ సంస్కృత మహాసభలో “అక్షర-పురుషోత్తమ దర్శనం”పై స్పెషల్ సెషన్

12 July 2025

Stay Sharp: వయసుతో పనిలేదు.. ఈ 10 టిప్స్ పాటిస్తే మీ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది..

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Addanki Narketpalli National Highway Diesel Theft,ఏపీలోని ఆ హైవేలో రాత్రిళ్లు లారీలు ఆపాలంటే డ్రైవర్లకు వణుకే.. కారణం తెలిస్తే! – a gang oil theft from lorries and other vehicles on addanki narketpalli national highway in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Addanki Narketpalli National Highway Diesel Theft,ఏపీలోని ఆ హైవేలో రాత్రిళ్లు లారీలు ఆపాలంటే డ్రైవర్లకు వణుకే.. కారణం తెలిస్తే! – a gang oil theft from lorries and other vehicles on addanki narketpalli national highway in andhra pradesh

.By .12 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Addanki Narketpalli National Highway Diesel Theft,ఏపీలోని ఆ హైవేలో రాత్రిళ్లు లారీలు ఆపాలంటే డ్రైవర్లకు వణుకే.. కారణం తెలిస్తే! – a gang oil theft from lorries and other vehicles on addanki narketpalli national highway in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Addanki Narketpalli National Highway Diesel: ఏపీ హైవేలపై లారీ డ్రైవర్లు బెంబేలెత్తిపోతున్నారు.. వారిని కొత్త సమస్య వెంటాడుతోంది. హైవేపై రాత్రిళ్లు లారీ ఆపితే నిద్రలేచేసరికి ట్యాంకులు ఖాళీ అవుతున్నాయట. ఎవరీ దొంగలు? ఎందుకీ దారుణాలు? అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై డీజిల్ దొంగల ముఠా హల్ చల్ చేస్తోంది. నిత్యం వాహనదారులను బెదిరించి దోచుకుంటున్నారు. పోలీసులు రంగంలోకి దిగి గస్తీ ముమ్మరం చేశారు. అసలు ఈ ముఠా ఎలా పనిచేస్తుంది? వీరి వెనుక ఎవరున్నారు? అనేది తేల్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హైలైట్:

  • ఏపీలో ఆ హైవేలో వెళ్లాలంటే డ్రైవర్లకు భయం
  • రాత్రిళ్లు లారీని ఆపాలంటేనే ఆలోచిస్తున్నారు
  • ఆ గ్యాంగ్ దెబ్బకు వణుకు పుడుతోందట
అద్దంకి నార్కెట్‌పల్లి నేషనల్ హైవే డీజిల్ దొంగతనం
అద్దంకి నార్కెట్‌పల్లి నేషనల్ హైవే డీజిల్ దొంగతనం (ఫోటోలు– Samayam Telugu)

ఏపీ మీదుగా వెళ్లే ఆ హైవేలో లారీ ఆపాలంటేనే డ్రైవర్లు భయపడుతున్నారట.. అందులో రాత్రిళ్లు అయితే వణికిపోతున్నారట. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ తెలిసింది. హైవేలో రాత్రి వేళల్లో రోడ్ల పక్కన ఆపేసిన లారీలు, బస్సులు, టిప్పర్లు, భారీ ట్రక్కులు, పొక్లెయిన్‌లలో డీజిల్ మాయం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అడ్డుకుంటే వారిని బెదిరిస్తున్నారు.. అంతేకాదు దాడులు చేస్తున్నారు.. అందుకే ఆ హైవేలో వెళ్లాలంటే ఆలోచిస్తున్నారట. ఒంగోలు వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే.. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేలో ఇలా తరచూ డీజిల్ దొంగతనాలు జరుగుతున్నాయంటున్నారు. ఓ ముఠా నాలుగైదేళ్లుగా డీజిల్ దొంగతనాలు చేస్తున్నారని చెబుతున్నారు. వీరంతా చదువు మధ్యలో ఆపేసి పెయింటర్లుగా, మెకానిక్‌లుగా పనిచేస్తూ విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి, చెడు వ్యసనాలకు బానిసలయ్యారట. డబ్బు సంపాదించడానికి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని గుర్తించారట. ఈ గ్యాంగ్ అద్దెకు కారు తీసుకుని రాత్రి వేళల్లో హైవేలపై తిరుగుతూ ఒంటరిగా ఉండే వాహనాలను టార్గెట్ చేస్తున్నారట. లారీలు, ఇతర వాహనాల ఆయిల్ పైపులు కత్తిరించి డబ్బాల్లో డీజీలి నింపుతున్నారట.. ఒకవేళ ఎవరైనా వాహనాల డ్రైవర్లు అడ్డుకుంటే కత్తులు చూపి చంపేస్తామని బెదిరిస్తున్నారట. ఈ గ్యాంగ్ హైవేలో వాహనాల నుంచి దొంగిలించిన డీజిల్‌ను ఇసుక రవాణా చేసే లారీలు, ట్రాక్టర్ల వారికి లీటరు రూ.70 చొప్పున అమ్మేసి క్యాష్ చేసుకుంటున్నారట.

ఇక ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్.. సర్కార్ కీలక నిర్ణయం

గతంలోనే వీరిపై నకరికల్లు, అమరావతి, రాజుపాలెం, పెదకూరపాడు పోలీస్ స్టేషన్లలో చాలా కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. కొండమోడు, నకరికల్లు, పిడుగురాళ్ల, చిలకలూరిపేట ప్రాంతాల్లో ఈ తరహా డీజిలు చోరీలు ఎక్కువగా చేసినట్లు పాత రికార్డులు చెబుతున్నాయట. పాపం కొందరు లారీ డ్రైవర్లు ఫుల్ ట్యాంక్ చేయించి అలా హైవే పక్కకు ఆపుకుని నిద్రలోకి జారుకున్నారు.. దొంగలు డీజిల్ మొత్తాన్ని కాజేశారు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయంటున్నారు. అయితే ఈ డీజిల్ చోరీలపై పోలీసులు స్పందించారు.. డీజిల్‌ దొంగతనం చేసినట్లు విచారణలో గుర్తించామని.. ఆయిల్‌ దొంగల ముఠాకు బ్రేకులు వేస్తామంటున్నారు. అంతేకాదు రాత్రి సమయంలో గస్తీ పెంచుతామన్నారు.. చోరీలకు అడ్డుకట్ట వేస్తామంటున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి