బాహుబలి..తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మూవీ. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, తమన్నా, అనుష్క శెట్టి, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టడమే కాకుండా రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు నెటిజన్స్ విషెస్ చెప్పడంతోపాటు ఆ సినిమా సాధించిన రికార్డ్స్, కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ క్రమంలోనే బాహుబలి టీమ్ అంతా ఒకచోట చేరి రీయూనియన్ పార్టీ చేసుకున్నారు. హీరో ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్ ఇలా అందరూ ఈ పార్టీలో పాల్గొన్నారు. అయితే తమన్నా, అనుష్క మాత్రం ఈ పార్టీకి మిస్సయ్యారు. ఇందుక గల కారణాలు తెలియరాలేదు.
ఇదిలా ఉంటే.. బాహుబలి : ది ఎపిక్ అనే టైటిల్ తో తెరకెక్కించిన ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి 2 : ది కన్ క్లూజన్.. అయితే ఇప్పుడు ఈ సినిమా రెండు భాగాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే బాహుబలి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన ప్రభాస్.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతేకాదు.. డార్లింగ్ తో సినిమా చేసేందుకు ఇతర భాషలకు చెందిన దర్శకనిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బాహుబలి సినిమాలో ప్రభాస్ శివుడిగా/మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా కనిపించారు. మొత్తం ఐదు సంవత్సరాలు ఈ సినిమాకు కేటాయించారు. అయితే బాహుబలి ఫస్ట్ పార్ట్ కోసం ప్రభాస్ రూ.25 కోట్లు.. సెకండ్ పార్ట్ కోసం రూ.25 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అంటే బాహుబలి మొత్తం రెండు భాగాలకు రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రూ.600 కోట్లతో నిర్మించగా.. రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
10 years ago, a question united the nation…Now the question and the answer return together in ONE grand epic. #BaahubaliTheEpic releases worldwide on October 31st, 2025.#Celebrating10YearsOfBaahubali #DecadeofBaahubaliReign #Baahubali pic.twitter.com/iCdTyicF4F
— Baahubali (@BaahubaliMovie) July 10, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..