తెలుగు, హిందీ సినీరంగాల్లో అందం, అభినయంతో ఆకట్టుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయిన హీరోయిన్స్ ఉన్నారు. అయితే ఫస్ట్ మూవీతో ఓ రేంజ్ క్రేజ్ వచ్చినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు అంతగా రాని ముద్దగుమ్మలు ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం సరైన సక్సెస్ కోసం కొన్నాళ్లపాటు ఎదురుచూసింది. అయినా ఎలాంటి బ్రేక్ రాలేదు. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమైపోయింది. ఆమె వెండితెరపై కనిపించి మూడేళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందం, అద్భుతమైన నటనతో మెప్పించినప్పటికీ.. ఈ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదు. గ్లామర్ షోలతో కుర్రకారుకు మెంటలెక్కించిన ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ? సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి రోజు రోజుకి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
ఈ హీరోయిన్ మరెవరో కాదండి.. సోనాల్ చౌహాన్. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2005లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఈ అమ్మడు.. అదే ఏడాది మలేషియాలో జరిగిన మిస్ వరల్డ్ టైటిల్ సైతం గెలుచుకుంది. ఇక 2006లో ప్రముఖ సంగీత స్వరకర్త హిమేష్ రేషమ్మియా ఆల్బమ్ లో ఛాన్స్ కొట్టేసింది. ఈ పాట భారీ విజయాన్ని సాధించిన తర్వాత 2008లో విడుదలై నహిందీ క్రైమ్ డ్రామా చిత్రం జన్నత్ లో కనిపించింది. ఇది ఆమెకు మొదటి సినిమా. ఈ సినిమా ఆమెకు పెద్ద హిట్. దీంతో ఆమెను ‘ది జన్నత్ గర్ల్’ అని పిలవడం మొదలుపెట్టారు.
ఇవి కూడా చదవండి
సోనాల్ చౌహాన్ ఒకే ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత సోనాల్ నటించిన 3G, బల్దాన్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నెమ్మదిగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. చివరగా తెలుగులో 2022లో వచ్చిన ఎఫ్ 3 సినిమాలో కనిపించింది సోనాల్. అలాగే 2023లో విడుదలైన ఆదిపురుష్ మూవీలో కనిపించింది. ఇందులో రావణుడి భార్య మండోదరి పాత్రను పోషించింది. ఈసినిమా డిజాస్ట్ర కావడంతో ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సోనాల్.. ఇటీవల ముంబైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాలో 8.2 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..