మీరు ఎప్పటికీ చురుగ్గా ఉండాలని అనుకుంటున్నారా? మీ మెదడును యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధ్యమే. కొన్ని సాధారణ అలవాట్లు మన జ్ఞాపకశక్తిని, ఆలోచనలను మెరుగుపరుస్తాయి. మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెదడును ఎప్పుడూ యువంగా ఉంచే ఆ పది రహస్యాలు ఇవిగోండి.
ఆరోగ్యకరమైన అలవాట్లతో చురుకైన మెదడు
నిరంతరం నేర్చుకోండి: కొత్త అలవాట్లు నేర్చుకోండి. పజిల్స్ పరిష్కరించండి. ఆన్‌లైన్ కోర్సులలో చేరండి. వర్క్‌షాప్‌లకు వెళ్ళండి. ఇవన్నీ మెదడుకు ఉత్సాహం ఇస్తాయి.
క్రమం తప్పక వ్యాయామం చేయండి: శారీరక శ్రమ మెదడుకు రక్త ప్రసరణ పెంచుతుంది. జ్ఞాపకశక్తి తగ్గకుండా చూస్తుంది.
మెదడుకు మేలు చేసే ఆహారం తినండి: ఆకుకూరలు, బెర్రీలు, నట్స్, ఒమేగా-3 ఉండే చేపలు, తృణధాన్యాలు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.
నాణ్యమైన నిద్ర ముఖ్యం: రోజుకు 7-8 గంటలు అంతరాయం లేని నిద్ర అవసరం. ఇది మెదడులోని విష పదార్థాలను తొలగించి, జ్ఞాపకశక్తి పెంచుతుంది.
ఒత్తిడిని నియంత్రించండి: దీర్ఘకాలిక ఒత్తిడి మెదడు కణాలకు హాని చేస్తుంది. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, మైండ్‌ఫుల్ వాకింగ్ వంటివి చేయండి.
సామాజికంగా కలవండి: స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి. ఇది మీ మనసును పదును పెడుతుంది. ఆలోచనా శక్తి తగ్గకుండా చూస్తుంది.
సిగరెట్లు, అతిగా మద్యం వద్దు: ఈ రెండూ మెదడుకు చాలా ప్రమాదకరం. వీటి వల్ల మతిమరుపు రావచ్చు.
నీరు బాగా తాగండి: డీహైడ్రేషన్ మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. రోజు తగినంత నీరు తాగడం ముఖ్యం.
తల రక్షించుకోండి: తలకు గాయాలు అయితే దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి సమస్యలు, తీవ్రమైన ఇబ్బందులు రావచ్చు. అందుకే, డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించి మీ తలను కాపాడుకోండి.
ఈ అలవాట్లను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే, మీ మెదడును దీర్ఘకాలం పాటు చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.