తమిళ చిత్రపరిశ్రమలో ఆమె ఒకప్పుడు అగ్రకథానాయిక. ఆమె పేరు దేవికా. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే డైరెక్టర్ ఎ.బీమ్సింగ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన దేవదాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది దేవికా. వీరి కుమార్తె కనక. తమిళంలో నటిగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత తెలుగులోనూ నటించింది. కరకట్టకరన్ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన కనక.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఒకానొక సమయంలో చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేసింది. ఆమె రామరాజన్, రజిని, ప్రభు, కార్తీక్, విజయకాంత్, మమ్ముట్టి వంటి ప్రముఖ హీరోలతో నటించింది.
16 ఏళ్ల వయసులోనే నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన కనక 26 ఏళ్లకే ఆకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. చివరగా విరలుకట్ట ఉదమియా సినిమాలో కనిపించింది. అప్పుడు ఆమెకు 26 ఏళ్లు. ఈ సినిమా త్రవాత ఆమె మరో సినిమా చేయలేదు. 1980ల్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కనక.. ఇండస్ట్రీకి అనుహ్యంగా గుడ్ బై చెప్పేసింది. అయితే కనక తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే విడాకులు తీసుకోవడంతో తల్లి వద్దే పెరిగింది కనక. అయితే 2002లో ఆమె తల్లి 59 సంవత్సరాల వయసులో ఆకస్మాత్తుగా మరణించింది. దీంతో కనక ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తర్వాత 2007లో కాలిఫోర్నియాకు చెందిన ఓ ఇంజనీర్ ను కనక వివాహం చేసుకుందనే వార్తలు వచ్చాయి.

Kanaka Ne
అయితే 2010లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కనక.. పెళ్లైన 15 రోజులకు తన భర్త కనిపించకుండా పోయాడని.. ఆ తర్వాత అతడి గురించి ఎలాంటి సమాచారం రాలేదని తెలిపింది. ఆ తర్వాత కనక గురించి అనేక రూమర్స్ వినిపించాయి. ఆ సమయంలో ఆమె చనిపోయిందంటూ ప్రచారం జరగ్గా.. తాను బాగానే ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేసింది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా జీవిస్తుంది. ఇటీవల నటి కుట్టి పద్మినితో కలిసి కనక దిగిన ఫోటో నెట్టింట వైరలయ్యింది. అయితే అందులో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
ఇవి కూడా చదవండి

Kanaka Latest
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..