బిగ్‌బాస్ రియాల్టీ షో.. బుల్లితెర అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న షో ఇది. మరో రెండు నెలల్లో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్పటివరకు 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9 సీజన్ స్టార్ట్ కాబోతుంది. దీంతో కొన్ని రోజులుగా కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ అందించేవారిని ఎంపిక చేసేందుకు కంటెస్టెంట్స్ వేటలో ఉంది బిగ్‌బాస్ టీమ్. అలాగే సీజన్ 8 కంటే ఈసారి షోలో చాలా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే సీరియల్ తారలతోపాటు ఈసారి సినిమా సెలబ్రెటీలను తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారట. అలాగే మొదట్లో సోషల్ మీడియా స్టార్స్ వద్దని భావించినప్పటికీ.. ఇప్పుడు నెట్టింట వివాదాలతో ఫేమస్ అయినవారిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో తాజాగా బిగ్‌బాస్ లిస్ట్ ఇదే అంటూ కొందరి పేర్లు నెట్టింట మారుమోగుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం ఒక్క ఆడియోతో వివాదంలో చిక్కుకున్న అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంతో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ పై విపరీతమైన ట్రోలింగ్, నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ఎక్కువగా వినిపించిన పేరు రమ్యమోక్ష. ఇప్పుడు ఆమెను హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను సంప్రదించారని.. రమ్య ఎంట్రీ ఆల్మోస్ట్ ఫిక్సైందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇక రమ్యతోపాటు రీతూ చౌదరి, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, బ్రహ్మాముడి ఫేమ్ దీపిక రంగరాజు, ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ కుమార్, గుప్పెడంత మనసు హీరో ముఖేష్ గౌడ, నవ్య స్వామి, అమర్ దీప్ భార్య తేజస్విని, నటుడు సాయి కిరణ్ లను బిగ్‌బాస్ టీమ్ సంప్రదించిందని సమాచారం. వీరితోపాటు ఒక కామన్ మ్యాన్ సైతం ఉండనున్నారు. సీరియస్, సోషల్ మీడియా తారలతోపాటు ఈసారి సినిమా సెలబ్రెటీలు సైతం ఉండనున్నారని టాక్.
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..