ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాల్గో సీజన్ కొద్దిరోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి APL గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ కృష్ణ రంగారావు కీలక ప్రకటన చేశారు. ఈసారి APLను IPL తరహాలో ప్రతిష్ఠా్త్మకంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఏపీలోని క్రికెట్ క్రీడాకారుల్లోని టాలెంట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా APL జరగబోతోందన్నారు. మారుమూల ప్రాంతాల క్రీడాకారులకు ఇదో చక్కటి అవకాశమని.. కొత్త టాలెంట్‌ను వెలికి తీసేందుకు APL చక్కటి వేదిక అని తెలిపారు. ఇక.. ఏపీఎల్ సీజన్-4కి ఏడు ఫ్రాంచైజీలు ముందుకొచ్చాయని.. ఈనెల 14న ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. ఆగస్ట్ 8 నుంచి APL మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని చెప్పారు. ఏపీఎల్ సీజన్-4లో 21 లీగ్‌లు, 4 ప్లే ఆఫ్స్‌తో 24 మ్యాచులు జరుగుతాయని.. ప్లేయర్స్‌లో టాలెంట్‌ను బయటకి తీయాలంటే ఇలాంటి టోర్నమెంట్‌లు అవసరమన్నారు సుజయ కృష్ణ రంగారావు.
మొత్తంగా.. ఏపీలోని క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని.. ఐపీఎల్ ఆడే స్థాయికి ఏపీ క్రికెటర్లు ఎదగాలని ACA ఆకాంక్షిస్తోంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..