రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇన్ స్టాగ్రామ్ లో హైదరాబాద్ కి చెందిన ఓ అమ్మాయి సూపర్ డ్రెస్సులు చూసి అట్రాక్ట్ అయింది. వెంటనే అక్కడున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేసింది. ఆ అవతలి వ్యక్తి డ్రెస్ బుక్ చేయాలంటే ముందు రూ.1000 పంపమని చెప్పాడు. పాపం ఆ అమ్మాయి నమ్మి ఫోన్ పే ద్వారా వెంటనే పంపింది. ఆ తర్వాత షిప్పింగ్ ఛార్జీలు అంటూ మరో రూ.700 అడిగారు. అది కూడా పంపింది. ఇలా విడతల వారీగా డబ్బులు తీసుకున్నాక.. మళ్ళీ డిస్పాచ్ ఛార్జ్ పేరుతో రూ.1500 పంపమని అడిగారు.
Mam Pay dispatch confirmation amount 1500
You have to pay dispatch charge only for 2 minutes Sir
After 2 minutes your extra amount will be returned
ఇలా స్టెప్ బై స్టెప్ డబ్బులు అడుగుతున్న విధానం చూసి.. అమ్మాయికి సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపించింది. వెంటనే ఇంట్లో వాళ్లకి చెప్పగా ముందుగా ఇన్ వాయిస్ అడగమని సూచించారు. సరే అని ఇన్ వాయిస్ కావాలని అడిగితే అవతలి వాళ్ల నుంచి నో రెస్పాన్స్. పైగా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ అవ్వడానికి నాలుగు నెలలు పడుతుందని కండీషన్లు పెట్టారు. ఈ తతంగం చూశాక తను మోసపోయిందని ఆ అమ్మాయికి క్లారిటీ వచ్చింది. ఇలాంటి మాయ మాటలతో డబ్బులు దోచుకుంటారు. రోజు ఎవరో ఒకరు ఇలా ఫ్రాడర్స్ చేతులో మోసపోతున్నారు.
ఇలాంటి ఆన్‌లైన్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే ముందుగా కొన్ని కీ పాయింట్స్ పాటించాలి. ఎవరైనా డైరెక్ట్ మెసేజ్ చేసి ముందుగా పేమెంట్ అడిగితే అలర్ట్ గా ఉండాలి. ఏ వ్యాపారమైనా పక్కా వెబ్ సైట్, అడ్రెస్, జీఎస్‌టీ నంబర్ ఉన్న ఇన్ వాయిస్ ఇవ్వగలగాలి. అలా ఇవ్వలేకపోతే అది ఫేక్ బిజినెస్ అనుకోవాలి.
అలాగే సోషల్ మీడియాలో కనిపించే నకిలీ షాపింగ్ పేజీలను క్రాస్ చెక్ చేయకుండానే డబ్బులు పంపవద్దు. ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవాలంటే కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. ఒక్క రూపాయి పోయినా.. అది మన పర్సనల్ డేటాను మోసగాళ్లకు చేరవేసే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ లో అధికారికంగా ఫిర్యాదు చేయాలి. లేదా దగ్గర్లోని సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఇది చదివిన ప్రతి ఒక్కరూ దీన్ని చిన్న సంఘటనగా కాకుండా.. సీరియస్ గా తీసుకోవాలి. నాకేం కాదులే అనుకునే లోపే మోసం జరగవచ్చు. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనైనా డబ్బు ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు డబుల్ చెక్ చేయాలి. మీ చుట్టూ ఇలాంటివి జరుగుతున్నాయంటే వెంటనే పోలీసులకు తెలియజేయండి.