అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో – ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై స్పందించారు కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ‘బ్లాక్ బాక్స్ డీ కోడ్ చేసి సమాచారం రాబట్టడంపై ఏఏఐబి అద్భుతంగా పనిచేసిందన్నారు. ఈ కేసులో ఎన్నో టెక్నికల్ అంశాలు ఇమిడి ఉన్నాయని. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని తెలిపారు. ఇప్పుడే దీనిపై తుది నిర్ణయానికి రాలేమని.. తుది నివేదిక వచ్చేవరకు వేచి చూద్దామన్నారు. అందుకే ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుంది.. అప్పుడే తుది నిర్ణయాలకు రావద్దు’ అని అన్నారు రామ్మోహన్ నాయుడు. అంతేకాదు.. పైలెట్ల సంభాషణ విషయంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో పైలట్లను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు రామ్మోహన్ నాయుడు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు సిబ్బంది మన దగ్గర ఉన్నారు. పౌర విమానాయన రంగనికి వాళ్లు వెన్నెముక లాంటివారు. ఈ రంగానికి వారే ప్రధాన వనరులు. వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం పని చేస్తుంది.’ అని అన్నారు.
మరోవైపు బీచ్ కారిడార్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖను ఫైనాన్షియల్ ఐటి హబ్ గా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎయిర్, రోడ్, రైల్ కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
రోజ్గార్ మేళలో 52 మందికి నియామక పత్రాల అందజేత..
విశాఖ సాగర్ మాలా కన్వెన్షన్ సెంటర్‌లో రోజ్ గార్ మేళాకు ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 52 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసారూ. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. రోజ్ గార్ మేళాను ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఒక చరిత్రలా ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని.. ప్రధాని నరేంద్ర మోడీ దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందిని..ఇప్పటికే భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కేంద్రమంత్రి అన్నారు. మూల పేట నుంచి భోగాపురం వరకు తీర ప్రాంతం గుండా రోడ్డు మంజూరు కావడం శుభ పరిణామమని ఆయన తెలిపారు. ఈ రోడ్డు ప్రస్తుతం డిపిఆర్ స్టేజ్ లో ఉందని. ఈ రోడ్డు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. త్వరలో రోడ్డు పనులు ప్రారంభించడానికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శేరవేగంగా సాగుతున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.