గత ఏడాదికాలంగా మౌనంగా ఉంటూ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి, వైసిపి నేత ధర్మాన ప్రసాదరావు ఎట్టకేలకు మౌనం వీడారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన శ్రీకాకుళం నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో తలుక్కు మన్నారు. తన మౌనం పైన కేడర్‌కి వివరణ ఇచ్చారు. రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు ఎలా తీసుకువెళ్ళాలనేదానిపై కేడర్ కి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో మిగతా పార్టీల వారికి ప్రాధాన్యత లేదని అన్నారు. పాపం పవన్ కల్యాణ్ దేనిలోన ఇన్వాల్వ్ కావడం లేదనీ, ఆయనకి ప్రభుత్వంలో ఏం రోల్ లేదని అన్నారు. పవన్‌కి ఉన్న అభద్రతాభావంతో స్టేజ్ మీదకు వచ్చినప్పుడల్లా చంద్రబాబును పొగిడే కార్యక్రమం పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేసారు.
రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనే మాటను మీ బుర్రలలోంచి తీసేయండని..దాన్ని టీడీపీ ప్రభుత్వం అనే సంబోధించాలని ఆయ కేడర్‌కు సూచించారు. రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి బలపడి అధికారంలోకి వస్తే ఈ కూటమి పార్టీలన్నీ మళ్ళీ వైసీపీ ఖాతాలోకే వచ్చేస్తాయని ఆయన అన్నారు. కాబట్టి తమ శత్రువు టిడిపినేనని.. దానితోనే మనం యుద్ధం చేయాల్సి వస్తుందని కేడర్‌కు తెలిపారు. చంద్రబాబు భారం అంతా తన ఒక్కడి మీద పడిపోకుండా ఉండటానికి కూటమి అంటున్నాడని అన్నారు. ఈ దొంగ పెపర్ తమకు వద్దనీ బీజేపీ వాళ్లు ఆరోజే మేనిఫెస్టో చింపి పారేశారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా కూడా టీడీపి వాళ్లు ఇంకా అపోజిషన్ పార్టీ లోపాలపై మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టే ఆని అన్నారు.
ధర్మాన ప్రసాద్ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.