మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక సమస్యలను చాలావరకు తగ్గించుకుంటారు. షేర్లు, ఆర్థిక లావాదేవీలలో మదుపు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు, సమర్థతకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే వృద్ధి చెందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.