Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Visakhapatnam Kailasagiri Ropeway,విశాఖవాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్, రెడీగా ఉండండి! – vmrda plans new ropeway at kailasagiri in visakhapatnam

13 July 2025

Viral Video: చిమ్మచీకటిలో దూరంగా కనిపించిన మెరిసే కళ్లు.. ఏంటా అని పరిశీలించగా.. వామ్మో.!

13 July 2025

Wimbledon Prize Money:ఫైనల్‌లో ఓడినా కోట్లలో డబ్బులు.. వింబుల్డన్ ఛాంపియన్ల మీద నోట్ల వర్షం

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kota Srinivasa Rao News,కోటా శ్రీనివాసరావు గన్‌మెన్ల కోసం MLA అయ్యాడు..: బాబు మోహన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు – actor babu mohan interesting comments on kota srinivasa rao political journey
ఆంధ్రప్రదేశ్

Kota Srinivasa Rao News,కోటా శ్రీనివాసరావు గన్‌మెన్ల కోసం MLA అయ్యాడు..: బాబు మోహన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు – actor babu mohan interesting comments on kota srinivasa rao political journey

.By .13 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kota Srinivasa Rao News,కోటా శ్రీనివాసరావు గన్‌మెన్ల కోసం MLA అయ్యాడు..: బాబు మోహన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు – actor babu mohan interesting comments on kota srinivasa rao political journey
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తెలుగు సినీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి విభిన్న పాత్రలతో మెప్పించిన కోటా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించారు. సహచర నటుడు బాబు మోహన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో కోటా రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను గన్‌మెన్లతో షూటింగ్‌కు వెళ్లడం చూసి.. కోటా కూడా ఎమ్మెల్యే కావాలని నిర్ణయించుకున్నారని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

హైలైట్:

  • కోటన్నతో గమ్మతి ఉండేది
  • గన్‌మెన్ల కోసమే ఎమ్మెల్యే అయ్యిండు
  • నేను మంత్రయితే తట్టుకోలేకపోయాడు
కోటా శ్రీనివాసరావు
కోటా శ్రీనివాసరావు (ఫోటోలు– Samayam Telugu)

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 83 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేసారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు వంటి విభిన్న పాత్రల్లో మెప్పించిన కోటా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. 1999 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేగా సేవలదించారు. విజయవాడ తూర్పు నియోజవకర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహించారు. అయితే ఆయన పొలిటికల్ జర్నీపై సహచర నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ గతంలో ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. తాను అప్పటికే ఎమ్మెల్యే అయి గన్‌మెన్లతో షూటింగ్‌కు వెళితే.. అది తట్టుకోలేని కోటా తాను కూడా ఎమ్మెల్యే కావాలని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చారు. బాబూ మోహన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. “జనరల్‌గా కోటా అన్న ఏదీ తట్టుకోలేడు. నేను తొలిసారి ఎమ్మెల్యే అయ్యాక గన్‌మెన్లతో షూటింగ్‌కు వెళ్లేవాడిని. అది చూసి కోటా.. ‘ఏరా గన్‌మెన్లా..?’ అంటూ ఒకింత కుళ్లుకునేవాడు. ఈడికి గన్‌మెన్లు.. నేనింకా ఈజీగా గెలుస్తా.. బాబూ మోహనే గెలిచిండంటే నాకు చాలా ఈజీ అని 1999 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. జస్ట్ గన్‌మెన్ల కోసమే ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆ తర్వాత ఎదురు పడినప్పుడు ‘నీకే గన్‌మెన్లు కాదు నాక్కూడా ఉన్నారు.. ఇదిగో చూడు’ అనే వాడు. మేం చాలా క్లోజ్ కదా.. అసెంబ్లీలో మరో తమాషా ఉండేది. నేను ముందు వరుసలో ఉండేది. లాస్ట్ బెంచ్‌లో కోటన్న ఉండేది. అక్కడ ముచ్చట్లు పెడితే బాగుండదు కదా. అయినా వినేవాడు కాదు. ‘అరేయ్.. నవ్వు అక్కడెందుకు కూర్చుంటవ్ రా.. మనం అన్నదమ్ములం కదా.. నా పక్కన కూర్చో’ అనేవాడు. ‘అయ్యో అన్న.. మనకు సీట్లు అలాట్‌మెంట్ ఉంటదే’ అని చెప్పినా వినేవాడు కాదు. అలా రెండేళ్లు గడిచాయి.

నేను మంత్రి అయిన తర్వాత నా సీటు మారింది. ఆ తర్వాత కోటన్న మరింత తట్టుకోలేకపోయాడు. ‘ఏరా నువ్వు మంత్రయితే.. పోయి అక్కడ కూర్చుంటవా.. ముందు వరుసలో నీకెం పనోయ్. వచ్చి నా పక్కన కూర్చో..’ అని అనేవాడు. అందుకు నేను ‘రూల్స్ రూల్సూ.. నేను కేబినెట్ మంత్రి.. నువ్వు జస్ట్ ఎమ్మెల్యే.. నువ్వు అక్కడ.. నేను ఇక్కడ..’ అని ఏడిపించేవాడిని. అయినా కోటన్న వినిపించుకోకపోయేది. ‘నీకు మంత్రి పదవి ఎందుకురా..? మనం ఎమ్మెల్యేలుగా ఉంటేనే బాగుంటది.. పక్క పక్కనే కూర్చోవచ్చు’ అని సతాయించేది. ఆ తర్వాత తాను ఎలాగూ మంత్రి కాలేనని తెలిసి కోటన్న అసెంబ్లీకి రావటం మానేశాడు. తర్వాతి ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. అలా 2004 తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.” అని కోటా శ్రీనివాస్ రావు పొలిటికల్ జర్నీపై బాబు మోహన్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

సందీప్ పూల

రచయిత గురించిసందీప్ పూల సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి