
పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లికి చెందిన బ్రహ్మా రెడ్డి, సుబ్బమ్మలది చిన్న కుటుంబం. ఇరవై ఏళ్ళ క్రితం వివాహమైంది. వీరికి పన్నెండేళ్ళ అఖిల్ రెడ్డి, పదకొండేళ్ల లక్ష్మీ కార్తిక ఇద్దరూ పిల్లలు.. సంసారం సాఫిగానే సాగిపోతుంది. వ్యవసాయంపై అధారిపడి జీవించే వీరి కుటుంబంలో రెండేళ్ళ నుంచి విషాదం మొదలైంది. ప్రత్తి, మిరప సాగులో వరుసగా నష్టాలు వచ్చాయి. దీంతో అప్పుల పాలయ్యారు. వడ్డీలు కూడా పెరగడంతో పదిలక్షల రూపాయలకు అప్పు పెరిగింది.
అప్పులు తీర్చే దారి తెలియక.. దిక్కుతోచని స్థితిలో బ్రహ్మా రెడ్డి గత ఏడాది జూలై పన్నెండున ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సుబ్బమ్మ ఇద్దరి పిల్లలతో జీవితాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేసింది. ఏడాది పాటు కష్టనష్టాలను తట్టుకొని నిలబడింది. అయితే బ్రతుకు భారంగా మారింది. అప్పులు తీర్చుకుంటూ, పిల్లలను చదివించడం అంత సులభం కాదని ఆమెకు అర్థమైంది. ఈలోగానే భర్త సంవత్సరికం వచ్చింది. అదే రోజు తాను చనిపోవాలనుకుంది. తను చనిపోతే పిల్లలు ఒంటరి వాళ్ళు అవుతారని భావించింది. వారిని కూడా తనతో పాటే అనంత లోకాలకు తీసుకెళ్ళాలని అనుకొంది.
జూలై పన్నెండున పిల్లలిద్దరిని తీసుకొని నాగార్జున సాగర్ సమీపంలోని అనుపు ప్రాంతానికి చేరుకొంది. అక్కడ అటవీ ప్రాంతానికి వెళ్ళిన తరువాత తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ మొదట పిల్లలపై పోసింది. ఆ తర్వాత తనపై పోసుకుంది. పెట్రోల్ పోయడాన్ని గమనించిన పిల్లలు తల్లి నుండి దూరంగా వెళ్ళారు. అదే సమయంలో ఆమె నిప్పు అంటించుకుంది. చిన్నారుల కళ్ళ ముందే మంటలు అంటుకున్నాయి. దీంతో భయభ్రాంతులకు గురైన చిన్నారులు ఎవరినైనా పిలుద్దామని.. అటవీ ప్రాంతంలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.. ఈ క్రమంలో ఒక సెక్యురిటి గార్డు ఎదుట పడ్డాడు. దీంతో పిల్లలు జరిగిన విషయాన్ని అతనికి చెప్పారు.
అందరూ కలిసి ఘటన స్థలానికి వెళ్ళే లోపే ఆమె మంటల్లో కాలోపోయి చనిపోయింది. ఆ పిల్లలిద్దరూ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. పోలీసులు ఈ ఘటనపై యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..