
ఉమ్మడి కర్నూలు జిల్లా శైవక్షేత్రాలలో శ్రీశైలం మహానంది యాగంటి ఓంకారం తర్వాత అత్యంత కీలకమైన ఆలయం కాల్వబుగ్గ రామేశ్వర స్వామి గుడి. కొన్ని దశాబ్దాల క్రితమే ఆలయం వెలసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని రామేశ్వర స్వామి దేవస్థానంలో 5 హుండీలను దుండగులు చోరీ చేశారు. ఆలయానికి మొత్తం ఎనిమిది హుండీలు.. అందులో ఐదు చిన్నవి. మూడు పెద్ద హుండీలను వదిలేసి దొంగలు చిన్న హుండీలను టార్గెట్ చేశారు. పెద్ద హుండీలను ఎత్తుకెళ్లలేకనో, లేకవాటిని దోచుకునేందుకు చేతకాకనో తెలియదు కానీ పెద్దవాటిని వదిలేసి ఐదు చిన్న హుండీలను ఎత్తుకెళ్లారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున స్వామి వారి కంకర్యాల కోసం గేటు తెరవడానికి ప్రయత్నించగా.. అప్పటికే గేట్ తెరిచి ఉండడం గమనించి ఆలయ ఈవోకి సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఆలయ సిబ్బంది ఆలయంలోకి వెళ్లి చూడగా హుండీలు కనపడకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆలయ మెయిన్ గేటు తాళాలు పగలగొట్టి ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకుని హుండీలను అపహరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు పక్కన కాలువలో హుండీలను పగలకొట్టి అందులో చిల్లర నాణేలను వదిలేసి నగదు, నోట్ల కరెన్సీని దుండగులు దోచుకెళ్లారు. మహాశివరాత్రి తర్వాత హుండీలో లెక్కింపు జరిగింది. గత ఐదు నెలల్లో భక్తులు హుండీలో సుమారు రెండు లక్షల రూపాయల నగదు వేసి ఉంటారని స్థానికులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయినా దృశ్యాలను పరిశీలించిన ఓర్వకల్లు ఎస్ఐ సునీల్ కుమార్ దుండగుల వయస్సు సుమారు 20 సంవత్సరాలు వరకు ఉంటుందని తెలిపారు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు ఓర్వకల్లు ఎస్సై తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..