అసలు పాము కనిపిస్తే చాలు అది ఏ రకం పాము అయినా సరే భయంతో వణికిపోతాం. మరి అలాంటిది ఒకేచోట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 తాచు పాములు కనిపిస్తే ఏమైనా ఉందా భయంతో ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది. ఇలాంటి సంఘటన మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఒక ఇంట్లో చోటు చేసుకుని. ఒక ఇంటి నుంచి అకస్మాత్తుగా డజన్ల కొద్దీ తాచు పాము పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు రావడం ప్రారంభించాయి. ఈ పాము పిల్లలతో పాటు, ఒక పెద్ద ఆడ పాము కూడా ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇది చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
కుటుంబ సభ్యులు వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశారు. పాములు పట్టే వ్యక్తి ఆ పాము పిల్లను.. ఆడ పామును పట్టుకున్నాడు. ఈ సమయంలో నేలను తవ్వినప్పుడు.. ఆడ పాము పెట్టిన గుడ్లు కూడా కనిపించాయి. వాటి నుంచి కూడా పాము పిల్లలు బయటకు వస్తున్నాయి.
సియోనిలోని దుండా సియోని పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సాయి నగర్‌లో నివసించే నందు దహ్రియా ఇంట్లో విషపూరితమైన నాగుపాము కుటుంబం మొత్తం కనిపించడంతో కలకలం రేగింది. మొదట డజన్ల కొద్దీ చిన్న పాము పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వచ్చాయి, తరువాత ఒక పెద్ద ఆడ పాము కనిపించింది. ఇంటి నుంచి పాములు బయటకు రావడాన్ని చూసిన కుటుంబం వెంటనే పాములు పట్టే వ్యక్తి ప్రవీణ్ తివారీకి సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పాములు పట్టే వ్యక్తి.. ఇంటి నుంచి బయటకు వచ్చిన 25 పాము పిల్లలను, పెద్ద నాగు పామును పట్టుకున్నాడు. దీని తరువాత.. పాములను పట్టే వ్యక్తి పాము పిల్లలు బయటకు వచ్చిన చోట ఇంటిలో తడిగా ఉన్న నేలను తవ్వి చూశాడు. పిల్లలు బయటకు వచ్చే చోట.. భారీ సంఖ్యలో పాము గుడ్లు కనిపించాయి. అంతేకాదు ఈ గుడ్ల నుంచి కూడా నాగు పాము పిల్లలు కూడా బయటకు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఎవరికీ హాని చేయలేదు
నందు దహ్రియా ఇంట్లో దొరికిన పాము గుడ్లతో పాటు ఈ కోబ్రా పిల్లలను, పెద్ద పాములను రక్షించిన వీడియోను కూడా కుటుంబ సభ్యులు తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ఇంట్లో భారీ సంఖ్యలో విషపూరిత పాములున్నా.. ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. ప్రవీణ్ తివారీ పెద్ద పాము, పాము పిల్లల్ని, పాము గుడ్లను రక్షించి తనతో తీసుకెళ్లాడు. అతను వాటిని సురక్షితంగా అడవిలో వదిలివేసినట్లు తెలుస్తుంది.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..