Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs ENG: ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న సిరాజ్‌.. ఓపెనర్‌ ముందు సింహ గర్జన! ఈ కోపం ఎందుకంటే..?

13 July 2025

భాషా వివాదం.. ఆటో డ్రైవర్‌ను చితకబాదిన ఉద్దవ్‌ ఠాక్రే వర్గం.. ఇంతకు అతను ఏమన్నాడంటే?

13 July 2025

Car Discount: ఈ అవకాశాన్ని వదులుకోకండి.. రూ.6 లక్షల లోపు ఉన్న కారుపై రూ.70 వేల తగ్గింపు!

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Raidu Case Vinutha Kota Allegations,ఇది అంత చేసింది ఆ టీడీపీ ఎమ్మెల్యేనే.. కోట వినుత సంచలన ఆరోపణలు – raidu case vinutha kota and her husband made sensational allegations against tdp mla bojjala sudheer
ఆంధ్రప్రదేశ్

Raidu Case Vinutha Kota Allegations,ఇది అంత చేసింది ఆ టీడీపీ ఎమ్మెల్యేనే.. కోట వినుత సంచలన ఆరోపణలు – raidu case vinutha kota and her husband made sensational allegations against tdp mla bojjala sudheer

.By .13 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Raidu Case Vinutha Kota Allegations,ఇది అంత చేసింది ఆ టీడీపీ ఎమ్మెల్యేనే.. కోట వినుత సంచలన ఆరోపణలు – raidu case vinutha kota and her husband made sensational allegations against tdp mla bojjala sudheer
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త శ్రీనివాసులు హత్య కలకలం రేపింది. ఈ కేసులో జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జి వినుత కోట, ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాయుడు గతంలో వినుత వద్ద డ్రైవర్‌గా పనిచేయగా, హత్యకు బొజ్జల సుధీర్ రెడ్డి కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వినుత కోటను జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లు పార్టీ కన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చీఫ్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు.

హైలైట్:

  • రాయుడు హత్య కేసులో కీలక పరిణామం
  • టీడీపీ ఎమ్మెల్యేపై కోట వినుత సంచలన ఆరోపణలు
  • అతడి వల్లే ఇదంతా అంటూ కామెంట్స్
కోట వినూత సంచలన ఆరోపణలు
కోట వినూత సంచలన ఆరోపణలు (ఫోటోలు– Samayam Telugu)

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త హత్యకు గురికావడం కలకలం రేపింది. శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురయ్యాడు. చెన్నైలోని మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూవం నదిలో మూడు రోజుల క్రితం ఒక మృతదేహం కనిపించింది. ఆ వ్యక్తి చేతిపై జనసేన సింబల్, వినుత పేరు ఉండటంతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. రాయుడుని ఈ నెల 8న హత్య చేసి నదిలో పడేసినట్లు విచారణలో తేలింది.ఈ కేసులో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి వినుత కోట, ఆమె భర్త చంద్రబాబుతో సహా ఐదుగురిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. రాయుడు గతంలో వినుత దగ్గర కారు డ్రైవర్‌గా, పీఏగా పనిచేశాడు. ఈ హత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాయుడుని హత్య చేసి నదిలో పడేశారు. ఈ కేసులో వినుత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటు గోపి, శివకుమార్, షేక్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ శ్రీకాళహస్తికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు.

పోలీసులు కోట వినుత, చంద్రబాబు, మిగిలిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో వినుత కోట మీడియాతో మాట్లాడుతూ, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుంది అని అన్నారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు కోట వినుత.. ఉన్నారు అని ఆమె సమాధానం ఇచ్చారు. చంద్రబాబు కల్పించుకుని, ఈ వ్యవహారంలో బొజ్జల సుధీర్ రెడ్డి (టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే) ఉన్నాడని ఆరోపించారు.

ఈ హత్య కేసు ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వినుత కోటను పార్టీ నుండి బహిష్కరించినట్లు ప్రకటించింది. పార్టీ కన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చీఫ్ వేములపాటి అజయ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. కొంతకాలంగా వినుత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని, ఆమె ప్రవర్తన పార్టీ నియమాలకు విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. వినుతపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఆమెను పార్టీ నుండి తొలగించామని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే 20 రోజుల క్రితం అనగా జూన్‌ 21వ తేదీన వినుత ఓ బహిరంగ ప్రకటన చేశారని.. రాయుడు చేసిన ద్రోహానికి తనని విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా మీడియా, సోషల్ మీడియాలో యాడ్ ఇచ్చారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇంతలోనే రాయుడు శవమై కనిపించడం.. ఈ కేసులో వినుతను చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాయుడు హత్య కేసును చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిపిల్లి.ధ‌ర‌ణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంత‌ర్జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి