ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ , కార్డు బోర్డ్స్ , ఆయిల్ క్యాన్స్ తో ఇంట్లో వాడుకునే వస్తువులు తయారు చేస్తునాటారు కొందరు. మరికొందరు తమ తెలివితేటలను ఆదాయ వనరుగాను మార్చుకుంటారు. ఎందుకంటే ఏ కళ అయినా పది మంది మెచ్చుకోవాలి , పది మందికి ఉపయోగపడాలి అపుడే దానికి ప్రయోజనం చేకూరుతుంది. ఆ కళాకారుడికి సైతం మంచి పేరు లభిస్తుంది. మన అందరి ఇళ్లలో కొబ్బరి కాయల నుంచి లభిస్తుంది. దాన్ని మనం పనికి రానిదిగా భావించి బయట పడేస్తాము . కానీ అల్లాంటి పీచుతో ఎన్నో అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చని పాలకొల్లు ప్రాంతానికి చెందిన వ్యక్తులు భావించారు. పక్షుల గూళ్లు తయారు చేశారు.
దేవుళ్ళ ప్రతిమలు, ఇంటి నమూనాలకు ఊపిరి పోస్తున్నారు. కేవలం కొబ్బరి పీచు మాత్రమే కాదు వరికంకులతో ఇంటి గుమ్మానికి కట్టుకునే తోరణాలు , కుచ్చులు తయారు చేసి విక్రయిస్తున్నారు. పూర్వం మండువా లోగిళ్ళలో వారికుచ్చులు ఎక్కువగా కనిపించేవి. పక్షలు ఆహారం కోసం వచ్చి సందడి చేసేవి. ఇపుడు పల్లెలు సైతం కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న క్రమంలో వారికంకుల కుచ్చులు ధరించి వాటిని ఇంటికి కట్టాలని ఆసక్తి వున్నా పూర్వంలా వాటిని నేర్పుగా కట్టే వ్యక్తులు దొరకడంలేదు. అలాంటి వారికి మార్కెట్లో ఇవి అందుబాటులోకి రావటం పట్ల పక్షుల ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..