
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం శివుని స్వయంభువుగా వెలిసిన జ్యోతిర్లింగం. ఇది శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ జ్యోతిర్లింగం గురించి నమ్మకం ప్రకారం ఇది సంతానం కోరుకునే జంటలకు ఒక వరం లాంటిది. ఇక్కడ శివుడు సంతానం లేని దంపతులకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే ఈ ఆలయంలో నిరంతరం భక్తుల రద్దీ ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ ఖాళీ ఒడితో ఇక్కడికి వస్తారు. తమ ఒడి అతి త్వరలో నిండిపోతుందని ఆశిస్తారు. శివునికి సంబంధించిన అనేక అద్భుత కథలు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగంతో ముడిపడి ఉన్నాయి. వాటిలో ఒకటి శివుడు తన భక్తుడి కొడుక్కి తిరిగి ప్రాణం పోశాడు. అందుకనే ఈ క్షేత్రానికి సంతానం కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.
ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది?
ఈ శివుని జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని దౌలతాబాద్‌లోని బరైల్ గ్రామంలో ఉంది. ప్రజలు ఈ ఆలయాన్ని ఘృష్ణేశ్వర మహాదేవ పేరుతో కూడా పిలుస్తారు. ఈ పేరు ఒక భక్తురాలి పేరు. ఆమె పేరు మీదుగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మహారాష్ట్రలోని అజంతా, అలోరా గుహలకు కొంచెం దూరంలో ఉంది.
ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథ
ఈ ఆలయం గురించి ఒక ప్రసిద్ధ పురాణ కథ ఉంది. సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో దేవగిరి పర్వతం మీద నివసించాడని చెబుతారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. జ్యోతిష్యం ప్రకారం సుధ గర్భవతి కాలేదని తేలింది. దీంతో సుదేహ తన చెల్లెలు ఘుష్మతో తన భర్తకు రెండో పెళ్లి చేసింది. ఘుష్మ శివునికి భక్తురాలు. ప్రతిరోజూ ఆమె 101 మట్టి శివలింగాలను తయారు చేసి పూజించేది. కొన్ని రోజుల తర్వాత ఘుష్మ ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. అయితే సుదేహ కు తన చెల్లెలి ఘుష్మ, ఆమె పిల్లాడిపై అసూయమొదలైంది. దీంతో ఒక రోజు ఆ బిడ్డను చెరువులో విసిరేసింది. ఘుష్మ ప్రతిరోజూ ఆ చెరువులోనే మట్టి శివలింగాలను నిమజ్జనం చేసేది. ఆ పిల్లాడి మరణ వార్త వ్యాపించింది. అందరూ దుఃఖంలో ఉన్నారు. అయితే ఘుష్మ ఏమీ జరగనట్లుగా శివుడిని పూజించడం మొదలు పెట్టింది. ఎప్పటిలాగే శివలింగాన్ని నిమజ్జనం చేయడానికి చెరువుకు చేరుకుంది. ఆమె శివలింగాన్ని నిమజ్జనం చేసిన వెంటనే శివుడు ప్రత్యక్షం అయి తన భక్తురాలి కొడుకును బ్రతికించాడు.
శివుడు సుదేహపై ఆగ్రహంతో తన త్రిశూలాన్ని తీసుకుని సంహరించాలని భావించాడు. అయితే ఘుష్మా తన అక్కని క్షమించమని కోరింది. దీనితో మహాదేవుడు చాలా సంతోషించాడు, ఘుష్మాని వరం అడగమని చెప్పాడు. అప్పుడు ఘుష్మా మహా దేవుడు లోక సంక్షేమం కోసం నువ్వు ఇక్కడ నివసించాలి అని కోరుకుంది. అప్పటి నుంచి ఈ జ్యోతిర్లింగం ఘుష్మా పేరుతో ఘుష్మేశ్వర మహాదేవ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పూజించే వారికి ఇప్పటికీ సంతానం కలుగుతూనే ఉంది.
ఆ సరస్సు ఇప్పటికీ ఈ ఆలయంలో ఉంది.
ఘుష్మా తాను పూజించే శివలింగాలను నిమజ్జనం చేసిన సరస్సు నేటికీ ఇక్కడ ఉంది. ఈ క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా పిల్లలు లేని వివాహిత జంటలకు పిల్లలు పుడతారు. దర్శనం చేసిన భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.