ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కేవలం రూ.2 కోట్లతో నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ విషయం ఏంటంటే.. ఈ సినిమాను కేవలం 7 రోజుల్లోనే షూటింగ్ చేసినట్లు సమాచారం. చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హారర్ సినిమాగా ఇది అగ్రస్థానంలో నిలిచింది. పెద్ద స్టార్ హీరోలు లేరు.. గొప్ప సన్నివేశాలు లేవు.. ఈ చిత్రాన్ని హ్యాండ్ హెల్డ్ కెమెరాతో చిత్రీకరించడం మరో విశేషం. కానీ ఈ సినిమా లక్షలాది మందిని భయపెట్టింది. ఆ సినిమా పేరు ‘పారానార్మల్ యాక్టివిటీ’. 2007లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.
కేటీ ఫెదర్‌స్టన్, మికా స్లాట్ నటించిన ఈ చిత్రాన్ని ఓరెన్ పీలే రచించి, దర్శకత్వం వహించి, నిర్మించారు. దర్శకుడు ఓరెన్ బెలికి ఇది మొదటి సినిమా. ఈ మూవీ మొత్తాన్ని ఆయన తన సొంత ఇంట్లోనే చిత్రీకరించారు. దర్శకత్వం నుంచి ఎడిటింగ్ వరకు ప్రతిదీ ఆయనే చూసుకున్నారు. ఈ సినిమాలో అందరూ చిన్న చిన్న నటీనటులు నటించారు. అలాగే ఈ మూవీ చూడటానికి చాలా వాస్తవికంగా ఉంటుంది.
ఈ సినిమా మొత్తానికి కేవలం రూ.12 లక్షల ఖర్చు అయినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ తిరిగి చిత్రీకరించడంతో బడ్జెట్ రూ.2 కోట్లకు చేరింది. ఒక యువ జంటను కనిపించని దెయ్యం ఎలా హింసిస్తుందనేది కథ. చీకటిలో అడుగుల చప్పుడు, భయంకరమైన నిశ్శబ్దం… అన్నీ థ్రిల్లింగ్ హర్రర్ అనుభవాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..
Cinema: ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన సినిమా అది.. 19 ఏళ్ల క్రితమే దుమ్మురేపింది.. ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే..