హైదరాబాద్‌లోనే అది ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీ. గత 12ఏళ్లుగా డైరెక్టర్‌గా ఒకే వ్యక్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ నూతన డైరెక్టర్‌గా ఫ్రొఫెసర్ సందీప్ శుక్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఆగస్టులో సందీప్ శుక్లా కొత్త డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. జూలై 12న జరిగిన ఐఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఈ ప్రకటన చేసింది. ప్రస్తుత డైరెక్టర్ పీజే నారాయణన్ త్వరలో తన పదవి నుంచి వైదొలగనున్నారు. డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగి లెక్చరర్‌గా కొనసాగుతానని నారాయణన్ తెలిపారు.
నారాయణన్ వైదొలగడంతో ప్రొఫెసర్ శుక్లా సంస్థ నాయకత్వాన్ని చేపట్టడానికి మార్గం సుగమం అయ్యింది. శుక్లా ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా గుర్తింపు పొందారు. సైబర్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలలో ప్రొఫెసర్ శుక్లాకు ఎంతో అనుభవం ఉంది. ప్రతిష్టాత్మకమైన ఐఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఫీల్ అవుతున్నట్లు శుక్లా తెలిపారు. సవాల్‌తో ఈ అవకాశాన్ని సమర్ధంగా నిర్వహిస్తానని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..