Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Mountain Places: ఈ పర్వత ప్రాంతాలు అద్భుతాలకు నిలయం.. కచ్చితంగా చూడాల్సిందే..

13 July 2025

Kitchen Hacks: ఇంట్లో తేమ వల్ల ఉప్పు చెడిపోతుందా? ఇలా చేస్తే తాజాగా ఉంటుంది.. సింపుల్ ట్రిక్స్‌!

13 July 2025

గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న విద్యుత్‌ ఛార్జీలు..! ప్రభుత్వం తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో..

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Amaravati Landless Poor Pension,ఏపీలో వారికి కొత్తగా పింఛన్లు.. ప్రభుత్వం ఉత్తర్వులు.. నెలకు రూ.5000! – ap government decides to provide pensions to 1575 more landless families in amaravati
ఆంధ్రప్రదేశ్

Amaravati Landless Poor Pension,ఏపీలో వారికి కొత్తగా పింఛన్లు.. ప్రభుత్వం ఉత్తర్వులు.. నెలకు రూ.5000! – ap government decides to provide pensions to 1575 more landless families in amaravati

.By .13 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Amaravati Landless Poor Pension,ఏపీలో వారికి కొత్తగా పింఛన్లు.. ప్రభుత్వం ఉత్తర్వులు.. నెలకు రూ.5000! – ap government decides to provide pensions to 1575 more landless families in amaravati
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భూమి లేని మరో 1575 కుటుంబాలకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమరావతిలో భూమి లేని సుమారు 19 వేల మందికి పింఛన్లు అందిస్తున్నారు. తొలుత రూ.2500గా ఉన్న ఈ పింఛన్లను ఆ తర్వాత రూ.5000లకు పెంచారు. తాజాగా మరో 1575 కుటుంబాలకు పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో వారికి కొత్తగా పింఛన్లు.. ప్రభుత్వం ఉత్తర్వులు.. నెలకు రూ.5000!
ఏపీలో వారికి కొత్తగా పింఛన్లు.. ప్రభుత్వం ఉత్తర్వులు.. నెలకు రూ.5000! (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు అందించనుంది. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండగా.. తాజాగా మరో 1575 కుటుంబాలకు పింఛన్లు అందించనుంది. 2015లో ఇంటింటి సర్వే ద్వారా అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు మంజూరు చేశారు. అయితే వివిధ కారణాలతో ఈ 1575 కుటుంబాలకు పింఛన్ నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చించారు. ఈ 1575 కుటుంబాలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఆ నిర్ణయం ఆధారంగా ఆదివారం అమరావతిలో భూమి లేని 1575 కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేయాలంటూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి.
మరోవైపు రాజధాని అమరావతి పరిధిలో ఉండే 29 గ్రామాలలో భూములు లేని పేదలకు 2014- 2015 నుంచి పింఛన్లు అందిస్తున్నారు. తొలుత నెలకు రూ.2500 పింఛన్ రూపంలో అందించగా.. ఆ తర్వాత పింఛన్ మొత్తాన్ని రూ.5000లకు పెంచారు. అయితే వైసీపీ హయాంలో వీరికి పింఛన్లు సరిగా పంపిణీ చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల పంపిణీ కోసం నిధులు కూడా విడుదల చేసింది.

Nara Lokesh amaravati speech: వంద పాకిస్థాన్‌లకు సమాధానం చెప్పే మిసైల్ మోదీ.. గడ్డి కూడా పీకలేరు..

అమరావతిలో 19 వేలమంది వరకూ భూమిలేని పేదలకు పింఛన్లు అందిస్తున్నారు. ఇప్పుడు మరో 1575 కుటుంబాలకు అందించనుండటంతో ఈ సంఖ్య 20 వేలు దాటనుంది. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ సమయంలో భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు, భూములు లేని పేదలకు పింఛన్లు అందిస్తామని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఆ మేరకు కౌలు డబ్బులు, పింఛన్లు అందిస్తోంది. ఇక అమరావతిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటం వ్యాలీ, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ సిటీ వంటి నిర్మాణాలను చేపట్టనుంది. ఇందుకోసం రెండోసారి భూమిని సమీకరించే ఆలోచనలో ఉంది. రాజధాని భవిష్యత్తు అవసరాల కోస మరింత భూమి అవసరం అవుతుందని ప్రభుత్వం చెప్తోంది. అమరావతి ఎయిర్‌పోర్టు కోసం 5000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం 2500 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేస్తోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి