Vijayawada Software Engineer: విజయవాడలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్న 28 ఏళ్ల యువకుడు.. విజయవాడలో ఇటీవల తన స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నాడు. అయితే ఇదే పార్టీలో ఓ 40 ఏళ్ల వివాహిత యువకుడికి పరిచయం అయ్యింది. ఆ పరిచయంతో ఫోన్లు, మెసేజులు మొదలయ్యాయి. అయితే ఆమె నుంచి ఇబ్బందికర మెసేజులు వస్తూ ఉండటంతో యువకుడు ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. దీంతో తనతో క్లోజ్‌గా ఉండకపోతే చనిపోతానంటూ బెదిరిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆమె వయసు సుమారుగా 40 వరకూ ఉంటుంది.భర్త, పిల్లలు.. చక్కటి సంసారం, ఇబ్బందులు లేకుండా గడిచిపోతున్న జీవితం. కానీ మనిషి బుర్ర మా చెడ్డది కదా.. ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆమె కూడా అంతే. యవ్వనం దశ దాటేసింది.. సుమారుగా సగం జీవితాన్ని చూసేసింది. కానీ.. జీవితంలో ఏదో వెలితి అనుకుందో, లేదా లైఫ్ అంటే ప్రతిరోజూ పండగలా ఉండాలని భ్రమపడిందో.. బండి గాడి తప్పింది. రైల్వే ట్రాక్ మీద జెట్ స్పీడుతో వెళ్తున్న జీవితం ట్రాక్ తప్పింది. అలా ఆమె కూడా జీవితంలో కొత్త రుచులు కోరుకుంది. చక్కని సంసారాన్ని వదిలి.. స్థానికంగా ఉండే యువకులతో స్నేహం, పార్టీలు ఇలా.. అదిగో అప్పుడే మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పరిచయం అయ్యాడు.
పార్టీలో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. మీరెక్కడుంటారు.. మీరెక్కడుంటారు అంటూ మొదలైన సంభాషణలు.. ఇంటి వరకూ వెళ్లాయి. వయసు తెచ్చిన యాంగ్జైటీనో, మరొకటో తెలియదు కానీ మనోడు.. తన వివరాలు అన్నీ చెప్పేశాడు. ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడు. కానీ జరగబోయే ముప్పును, రాబోయే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పరిచయం పెంచుకున్న వివాహిత.. ఆ తర్వాత అతని ఇంటికి వెళ్లింది.. ఇంట్లో వాళ్లను కూడా పరిచయం చేసుకుంది. అది మొదలు అప్పటి నుంచి మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు బొమ్మ త్రీడీలో కనిపించడం మొదలెట్టింది. పదే పదే ఆమె నుంచి ఫోన్లు, మెసేజ్‌లు.. కొన్ని రోజులు ఫోన్ కాల్స్ మాట్లాడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఆ తర్వాత సినిమా మొదలైంది.
వివాహిత నుంచి ఇబ్బంది కలిగించేలా మెసేజ్‌లు.. తరుచుగా ఫోన్లు.. మనోడికి విసుగొచ్చింది. ఆంటీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేశాడు. అప్పుడే వివాహితలోని మరో కోణం వెలుగుచూసింది. తనతో సన్నిహితంగా ఉండకపోతే చచ్చిపోతానంటూ బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో ఏం చేయాలో పాలుపోని యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు ఆంటీతో కలిగిన పరిచయం.. ఆ పరిచయం తెచ్చిన ఇబ్బందులు.. ఇలా వరుసగా తన గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో వివాహితను స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు.. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు. ఈసారికి సరిపోయిందని.. ఇంకోసారి ఫోన్, మెసేజులు చేసుకుంటున్నారని తెలిస్తే చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చి ఇళ్లకు పంపించారు. అలాగే ఓ పార్టీలో కలిసిన ఆంటీ.. మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీస్ స్టేషన్ గడప తొక్కేలా చేసింది.