SBI Credit Card Rules: మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తుంటే ఈ వార్త మీ కోసమే. ఎస్‌బీఐ కార్డ్ తన క్రెడిట్ కార్డ్ నియమాలలో ప్రధాన మార్పులను ప్రకటించింది. ఇది జూలై 15, 2025 నుండి అమల్లోకి వస్తుంది. వీటిలో ఉచిత విమాన ప్రమాద బీమా, చెల్లింపు పరిష్కారం పద్ధతి, కనీస మొత్తం బకాయి గణన (MAD)కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ మార్పులు ఎస్‌బీఐ ప్రీమియం కార్డులను ఉపయోగిస్తున్న, విమాన ప్రమాద బీమా వంటి సౌకర్యాలను పొందుతున్న కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అలాగే EMI తీసుకునేవారు లేదా చిన్న మొత్తాలలో బిల్లు చెల్లించేవారు కూడా మరింత కఠినతను ఎదుర్కోవలసి ఉంటుంది. మరి ఎలాంటి మార్పులు ఉండనున్నాయో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Sanchar Saathi: మీ మొబైల్ పోయిందా? నో టెన్షన్.. ఈ ప్రభుత్వ యాప్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు!
ఇప్పుడు ఈ కోటి రూపాయల బీమా లభించదు:
ఇవి కూడా చదవండి
ఇప్పటివరకు ఎస్‌బీఐ కొన్ని ప్రీమియం కార్డులపై రూ.1 కోటి వరకు ఉచిత విమాన ప్రమాద బీమా అందుబాటులో ఉంది. కానీ ఈ సౌకర్యం జూలై 15, 2025 నుండి నిలిపివేయనుంది ఎస్‌బీఐ.
ఏ కార్డుదారులు ప్రభావితమవుతారు:
- ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్
- ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్
- ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్
50 లక్షల బీమా కూడా నిలిపిత:
50 లక్షల వరకు ఉచిత విమాన ప్రమాద బీమా అందుబాటులో ఉన్న కార్డులు ఉన్నాయి. అది కూడా ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండానే. అది కూడా జూలై 15 నుండి నిలిచిపోనుంది. మీరు ఈ కార్డులను ఉపయోగిస్తుంటే, మీరు ఇకపై ఈ బీమా కవర్ ప్రయోజనాన్ని పొందలేరని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: Fact Check: సెప్టెంబర్ నాటికి రూ.500 నోట్లు నిలిచిపోనున్నాయా? ప్రభుత్వం కీలక ప్రకటన
ప్రభావితం అయ్యే కార్డులు:
- ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్
- ఎస్‌బీఐ కార్డ్ పల్స్
చెల్లింపు పరిష్కారం కోసం కొత్త నియమం:
మీరు క్రెడిట్ కార్డ్‌లో చేసే చెల్లింపును బ్యాంక్ వేర్వేరు ఖర్చు భాగాలుగా విభజించడం ద్వారా సర్దుబాటు చేస్తుంది. ఇప్పుడు ఎస్‌బీఐ కార్డ్ దాని క్రమాన్ని మార్చుకుంది.
కనీస మొత్తం బకాయి (MAD) గణనలో మార్పు:
ఇప్పుడు SBI క్రెడిట్ కార్డు కనీస చెల్లింపు పద్ధతి కూడా మారిపోయింది.
100% జీఎస్టీ, 100% EMI మొత్తం, 100% ఛార్జీలు, రుసుములు, 100% ఫైనాన్స్ ఛార్జ్ పరిమితి మించిపోయిన మొత్తం (వర్తిస్తే) మిగిలిన మొత్తంలో 2% ఉంటుంది. ఈ మార్పు ప్రకారం మీరు ప్రతి నెలా పూర్తి బిల్లు చెల్లించలేకపోతే, కనీస బకాయి మాత్రమే చెల్లించలేకపోతే ఇప్పుడు మీరు మునుపటి కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చు.
ఇది కూడా చదవండి: Bank Holidays: వచ్చే రెండు వారాల్లో 6 రోజులు బ్యాంకులు బంద్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి