ట్యాంకర్ నిండా దాదాపు 5 వేల లీటర్ల పాలు ఉన్నాయి. కొద్ది సేపట్లో అవి వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ, సడెన్‌గా కొంతమంది వచ్చి.. ఆ పాలను నేలపాలు చేశారు. అదేంటి వాళ్లకేమైనా పిచ్చిపట్టిందా? చిక్కటి పాలను అలా నేల పాలు చేశారని అనుకుంటున్నారా? నిజానికి వాళ్లు అలా చేసి చాలా మంది పని చేశారు. ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలు రక్షించారు. అది ఎలాగంటే.. ఆ ట్యాంకర్లో ఉన్న పాలు కల్తీవి. మధ్యప్రదేశ్ నుంచి ఆగ్రాకు వస్తున్న పాల ట్యాంకర్‌ను అధికారులు ఆపి తనిఖీ చేశారు. అవి కల్తీ పాలు అని తేలడంతో అక్కడికక్కడే అంతా రోడ్డు పక్కన పారపోశారు. అయితే పాలు పారపోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి ఆహార శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ట్యాంకర్‌లో థర్మోస్టాట్ లేకుండా పాలు నింపారని, దీంతో అవి కల్తీ పాలని అని తేలిందని అన్నారు. ట్యాంకర్‌కు UP 80 GT 8088 నంబర్ ఉందని, మధ్యప్రదేశ్‌లోని కైలారస్ మోరెనాలో ఉన్న త్యాగి డెయిరీ నుండి దీనిని పంపినట్లు ఆయన తెలిపారు. FSDA బృందం పాల నమూనాలను పరీక్ష కోసం పంపింది. నివేదిక వచ్చిన తర్వాత సంబంధిత డెయిరీ ఆపరేటర్ సుఖేంద్ర త్యాగిపై తగిన చర్యలు తీసుకుంటారు. ఈ పాలను ఆగ్రాలోని బాహ్ ప్రాంతానికి సరఫరా చేయాల్సి ఉంది. ట్యాంకర్ డ్రైవర్ రవీంద్ర రావత్ ఆగ్రాలో విక్రయించడానికి పాలను తీసుకువస్తున్నట్లు చెప్పాడు. పాలు పరిమాణం 5000 లీటర్లు, దాని విలువ దాదాపు రూ.1.25 లక్షలు ఉంటుందని అంచనా.
కల్తీ పాలు తాగి ఇద్దరు పిల్లలు మృతి
కాగరౌల్‌లో గురువారం రాత్రి పాలు తాగిన ఇద్దరు అమాయక పిల్లలు మరణించారు. మరణించిన పిల్లల్లో 11 నెలల వయసున్న అవాన్, రెండేళ్ల మహిరా ఉన్నారు. ఈ పిల్లలకు జాగ్నేర్‌లోని బచ్చుస్ డెయిరీ నుంచి తెచ్చిన పాలు తాగించారు. ఈ డెయిరీపై కూడా సంబంధిత అధికారులు దాడులు చేసి నమూనాలను సేకరించారు. కల్తీ చేసేవారిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి కల్తీ జరిగితే కఠిన చర్యలు తప్పవని ఆహార శాఖ హెచ్చరించింది.
#UPFDA ने आगरा में अवैध दूध मिलावट संचालन का भंडाफोड़ किया। एक दूध टैंकर में संदिग्ध मिलावटी दूध जब्त किया गया।नमूने एकत्र किए और जांच परिणामों के आधार पर कानूनी कार्रवाई की जाएगी।
यह त्वरित कार्रवाई सभी के लिए सुरक्षित भोजन सुनिश्चित करने की #FSSAI की प्रतिबद्धता को दोहराती है pic.twitter.com/aE7YLwNyZW— FSSAI (@fssaiindia) July 13, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి