తెలంగాణలో రాగల రెండ్రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వాతారణశాఖ హెచ్చరికల ప్రకారం రానున్న హైదరాబాద్ సహా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల్లో వర్షాలతో పాటు ఈదురుగాలుల కూడా వీసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. వర్షాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.