బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని హయాఘాట్ ప్రాంతంలోని ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలో నిద్రపోయాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి.. ఎంచక్కా.. క్లాస్ రూమ్‌లోనే కునుకుతీశాడు. హెడ్ మాస్టర్ పాఠశాలలోని బెంచ్ మీద గాఢ నిద్రలో నిద్రపోతున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
దర్భంగా జిల్లా హయాఘాట్ బ్లాక్‌కు చెందిన మజౌలియాలోని శివసింగ్‌పూర్‌లోని ఉపక్రమణిత్ అప్పర్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నవల్ ఝా తరగతి గదిలో నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధానోపాధ్యాయుడు బెంచ్ మీద గాఢ నిద్రలో నిద్రపోతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో చిన్న పిల్లలు తరగతి గదిలో ఆడుకోవడం, మాట్లాడుకోవడం చేస్తున్నారు.
ఈ వీడియో తీసిన అలోక్ చౌరాసియా మాట్లాడుతూ.. మేము మా స్కూల్ వెనుక ఉన్న మామిడి తోటను చూడటానికి వెళ్ళాం. హెడ్ మాస్టర్ స్కూల్ కి వచ్చి నిద్రపోతున్నట్లు నేను కిటికీ నుండి చూశాను. పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఆయన నిద్రపోవడంతో పిల్లలు స్కూల్ బయట కూడా తిరుగుతున్నారు. అందుకే నేను కిటికీ నుండి వీడియో తీశాను. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత టీచర్లు తనపై కోపంగా ఉన్నారని, తనను తిడుతున్నారని ఆయన అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి