Mohammed Siraj : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ ప్రస్తుతం నడుస్తోంది. జూలై 13న మ్యాచ్ నాలుగో రోజున మహ్మద్ సిరాజ్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెన్ డకెట్‌ను అవుట్ చేసి పెవిలియన్ కు పంపాడు. ఇది టీమిండియాకు ఓ కీలక వికెట్. అయితే, వికెట్ తీసిన తర్వాత సిరాజ్ తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ డకెట్ దగ్గరకు వెళ్లి గట్టిగా అరిచాడు. ఇప్పుడు సిరాజ్ చేసిన దానిపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారీ జరిమానా కూడా విధించవచ్చు. ఐసీసీ రూల్స్ దీని గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
మ్యాచ్ నాలుగో రోజున సిరాజ్ ఆరో ఓవర్‌లో బెన్ డకెట్‌ను అవుట్ చేశాడు. వికెట్ తీసిన తర్వాత, అతను డకెట్ వైపు కోపంగా అరుస్తూ కనిపించాడు. ఈ ప్రవర్తన వల్ల ఐసీసీ ఇప్పుడు మహ్మద్ సిరాజ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భారీ జరిమానా కూడా ఉండవచ్చు.
ఐసీసీ ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.5 కింద ఐసీసీ సిరాజ్‌పై చర్యలు తీసుకోవచ్చు. ఈ నియమం ప్రకారం ఒక బౌలర్ బ్యాట్స్‌మెన్‌ను రెచ్చగొట్టేలా తీవ్రంగా ప్రవర్తిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. సిరాజ్ చర్యలు ఈ నిబంధన పరిధిలోకి వస్తాయి. దీని ఫలితంగా అతనికి జరిమానా విధించవచ్చు. నేరం గనుక రుజువైతే సిరాజ్‌కు అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత, తన పై క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ విధించవచ్చు.
ఈ వివాదం ఉన్నప్పటికీ సిరాజ్ లార్డ్స్ టెస్ట్‌లో భారత్ తరపున బంతితో అద్భుతంగా రాణించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతను 23.3 ఓవర్లు వేసి 85 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అతను ఇప్పటికే ఓలీ పోప్, బెన్ డకెట్‌తో సహా మరో 2 వికెట్లు తీశాడు. లార్డ్స్‌లో మహ్మద్ సిరాజ్ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. అతను ఈ మైదానంలో ఇప్పటివరకు 12 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనలను చూస్తే సిరాజ్ భారత జట్టుకు అత్యంత ముఖ్యమైన బౌలర్లలో ఒకడు అని స్పష్టమవుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…