ఆపిల్ త్వరలో తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17e ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది వచ్చే ఏడాది 2026 వసంత కాలంలో మార్కెట్లోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ మోడల్ ఆపిల్ గత సంవత్సరం విడుదలైన మోడల్ కంటే మెరుగైనదిగా ఉండే అవకాశం ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఐఫోన్ 16e తర్వాత ఐఫోన్ 17e ప్రవేశం గురించి వినియోగదారులు, టెక్ పరిశ్రమలో మరింత చర్చ మొదలైంది.
ఇది కూడా చదవండి: Sanchar Saathi: మీ మొబైల్ పోయిందా? నో టెన్షన్.. ఈ ప్రభుత్వ యాప్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు!
ఐఫోన్ 17e ఆపిల్ తాజా A19 చిప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఐఫోన్ 16e లో కనిపించే ప్రస్తుత A18 చిప్ నుండి అప్‌గ్రేడ్ పొందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భవిష్యత్తులో ఆపిల్ ఇంటెలిజెన్స్ అప్‌డేట్‌ల కోసం దీనిని రూపొందిస్తున్నట్లు సమాచారం. దీని డిజైన్ పెద్దగా మారదు. ఫేస్ ఐడితో సింగిల్ 48MP కెమెరాతో వస్తున్నట్లు పుకార్లు ఉన్నప్పటికీ, A19 ప్రాసెసర్‌ను చేర్చడం గణనీయమైన మెరుగుదలను సూచిస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Fact Check: సెప్టెంబర్ నాటికి రూ.500 నోట్లు నిలిచిపోనున్నాయా? ప్రభుత్వం కీలక ప్రకటన
17e లో C2 మోడెమ్‌ని చేర్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ టెక్నాలజీ ఐఫోన్ 18తో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఐఫోన్ 17e విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ దీనిపై ఎన్నో రకాల పుకార్లు వ్యాపిస్తు్న్నాయి. లాంచ్ దగ్గర పడుతున్న కొద్దీ లీక్‌లు, పుకార్లు ఎక్కువైపోతున్నాయి. అయితే ఈ మోడల్ డిస్‌ప్లే ఐఫోన్ 14 డిస్‌ప్లేలాగా ఉండే అవకాశం ఉందని లీకుల ద్వారా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bank Holidays: వచ్చే రెండు వారాల్లో 6 రోజులు బ్యాంకులు బంద్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి