ప్రస్తుతం లార్డ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా రెండు బలమైన జట్ల రికార్డును బద్దలు కొట్టింది.
మరి ఆ రికార్డ్ ఏంటో? దాని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి జట్ల పేరిట ఉన్న భారీ రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. విదేశీ గడ్డపై టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా టీం ఇండియా నిలిచింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత్ ఐదుసార్లు బ్యాటింగ్ చేసి మొత్తం 36 సిక్సర్లు కొట్టింది.
గతంలో న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు విదేశీ గడ్డపై టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును కలిగి ఉన్నాయి. 2014/15లో యుఎఇలో పాకిస్థాన్‌పై కివీస్ 32 సిక్సర్లు కొట్టింది. ఆ సమయంలో యుఎఇ పాకిస్తాన్‌కు సొంత మైదానం. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ 32 సిక్సర్లు కొట్టింది. దీనికి ముందు 1974/75లో వెస్టిండీస్ భారత పర్యటనలో 32 సిక్సర్లు కొట్టింది. ఇప్పుడు, ఇంగ్లాండ్‌తో ప్రస్తుత సిరీస్‌లో భారత్ 36 సిక్సర్లు కొట్టింది.

లార్డ్స్ మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ జో రూట్ జట్టు తరపున 104 పరుగులు సాధించగా, మిగిలిన ఆటగాళ్లు కూడా తమ పాత్రలను చక్కగా పోషించారు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. ఇంతలో, భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ జట్టు తరపున 100 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 74 పరుగులు అందించాడు.