Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tirumala Vip Break Darshan Cancelled July 15 16,తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. రెండ్రోజులు ఆ దర్శనాలు రద్దు, టైమింగ్స్ కూడా మారాయి – tirumala ttd cancelled vip break darshan on july 14 and 15 due to anivara asthanam

14 July 2025

Tirumala Darshan Devotees Heavy Rush,తిరుమలలో ఇలా జరగడం విచిత్రంగా ఉందే.. మళ్లీ చాలా రోజుల తర్వాత, ఏమైందంటే – tirumala devotees heavy rush at due to weekend waiting time for darshan

14 July 2025

Annamayya Lorry Accident,అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది కూలీలు మృతి – annamayya district road accident pullampet lorry crash

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Amaravati Bits Pilani Campus,BITS Pilani in AP: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అమరావతిలో రూ.1000 కోట్లు పెట్టుబడి.! – bits pilani plans to setup ai campus in amaravati with 1000 crore
ఆంధ్రప్రదేశ్

Amaravati Bits Pilani Campus,BITS Pilani in AP: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అమరావతిలో రూ.1000 కోట్లు పెట్టుబడి.! – bits pilani plans to setup ai campus in amaravati with 1000 crore

.By .13 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Amaravati Bits Pilani Campus,BITS Pilani in AP: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అమరావతిలో రూ.1000 కోట్లు పెట్టుబడి.! – bits pilani plans to setup ai campus in amaravati with 1000 crore
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


BITS Pilani at Amaravati in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ రానుంది. రూ.1000 కోట్లతో 35 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. 2027 నాటికి కార్యకలాపాలు ప్రారంభించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులతో 7000 మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. మరోవైపు ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్‌టీ సంస్థలు కలిసి క్వాంటం వ్యాలీని, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే.

: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అమరావతిలో రూ.1000 కోట్లు పెట్టుబడి.!
: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అమరావతిలో రూ.1000 కోట్లు పెట్టుబడి.! (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది. ఇప్పటికే అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ ముందుకు వచ్చింది. బిట్స్ పిలానీ అమరావతిలో కొత్తగా క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. రూ. 1000 కోట్లతో అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు యూనివర్సిటీ ఛాన్సలర్, బిర్లా గ్రూప్ ఛైర్‌పర్సన్ కుమార మంగళం బిర్లా వెల్లడించారు. అమరావతిలో బిట్స్ పిలానీ ఏర్పాటు చేయబోయే క్యాంపస్ ప్రధానంగా ఆర్టిఫిషియల్ కేంద్రంగా ఉంటుంది. 2027 నాటికి ఈ క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారు.
రెండు విడతల్లో 7000 మంది విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ (ఏఐ ప్లస్) క్యాంపస్‌లో చేర్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కుమార్ మంగళం బిర్లా వెల్లడించారు. అమరావతిలో 35 ఎకరాల్లో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంపస్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ ), మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అందించనున్నారు. ఆర్ఠిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇన్నోవేషన్, స్ట్రాటజీలలో ఆయా కోర్సులు అందించే ఆలోచనలో ఉన్నారు.

*28 ఏళ్ల యువకుడికి పార్టీలో పరిచయమైన 40 ఏళ్ల వివాహిత.. ఆ తర్వాతే అసలు కథ, పాపం పసివాడు!

దీనితో పాటుగా.. మౌలిక వసతులు, రీసెర్చ్, డెవలప్‌మెంట్ సామర్థ్యం పెంచుకునేందుకు మరో రూ.1219 కోట్లు ఖర్చు చేయాలని బిట్స్ యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు బిట్స్ పిలాని యాజమాన్యం సొంతంగా బిట్స్ పిలాని డిజిటల్ పేరుతో సొంతంగా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్లా్ట్ ఫామ్ తీసుకువచ్చింది. మరో ఐదేళ్లలో బిట్స్ పిలాని డిజిటల్ ద్వారా 32 ప్రోగ్రామ్స్ లాంఛ్ చేయాలని భావిస్తోంది. ఇందులో 11 డిగ్రీ కోర్సులు కాగా.. మరో 21 సర్టిఫికేట్ కోర్సులు ఉండనున్నాయి.
మరోవైపు ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్‌టీ సంస్థలు కలిసి అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే.2026 జనవరి ఒకటి నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ ద్వారా కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది.

గురుపౌర్ణమి రోజు పున్నమి చంద్రుని దర్శనం చేసుకున్నా.. చంద్రబాబును చూసి మహిళ భావోద్వేగం

ఇక మంగళగిరి ఐటీ పార్కులో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. వీటితో పాటుగా పై కేర్ సర్వీసెస్ కూడా మంగళగిరిలో పెట్టుబడులు పెట్టనుంది. అలాగే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కోసం భూములు కేటాయించారు. వీటి ఏర్పాటు ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి ఉపయోగపడతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి