దిన ఫలాలు (జూలై 14, 2025): మేష రాశి వారు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశముంది. వృషభ రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్ని తేలికగా చక్కబెడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. బాగా ఒత్తిడి ఉండ వచ్చు. అనుకోకుండా ఒకటి రెండు వివాదాలు, సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులు మీ సలహాల వల్ల లబ్ధి పొందుతారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ జీవితం సంతృప్తికరంగా గడిచిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల చదువులు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ప్రతి పనీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకోకుండా మంచి హోదా లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలపరంగా దూసుకుపోతారు. పోటీదార్ల సమస్య నుంచి చాలావరకు బయటపడతారు. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొన్ని ఒత్తిళ్లు, సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. కొందరు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా శుభవార్తలు ఎక్కువగా వింటారు. కొన్ని విజయాలు, సాఫల్యాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. సర్వత్రా మీ మాటకు విలువ ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో కొద్దిగా బాధ్యతలు మారే అవకాశం ఉంది. శ్రమాధిక్యత ఉన్నా వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా పురోగమిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ చక్కబడతాయి. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యల్లో ముఖ్యమైనవి పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగుపడుతుంది. ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. ఆర్థికంగా ఇతరుల మీద ఆధారపడే అవకాశం ఉండదు. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరిగి కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా సంతృప్తికరంగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత కష్టనష్టాల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడతారు. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కొందరు బంధువుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి.