పదిరూపాయలు కనిపిస్తేనే పట్టుమని పాకెట్‌లో వేసుకునే రోజులు ఇవి.. కానీ ఇక్కడో ఆటో డ్రైవర్ మాత్రం ఆలా చేయలేదు. తన నిజాయితితో ఓ ఆగిపోవాల్సిన పెళ్లిని సజావుగా జరిగేలా చేశాడు. వరుడు కుటుంబ సభ్యులు తన ఆటోలో మరిచిపోయిన 18 తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను తిరిగి వాళ్లకు అప్పగించి వారి ముఖంలో నిరునవ్వులు పూయించాడు. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం కంజిరాంచిరకు చెందిన కరక్కట్ జేమ్స్ అనే ఇంట్లో ఈ సంఘటన జరిగింది. సోమవారం జేమ్స్ కుమారుడైన ఆల్బర్ట్ వివాహం జరగాల్సి ఉంది. అయితే వీరి బంధువులైన అనీష్, నయన అనే ఇద్దరు పెళ్లికి కావాల్సిన బంగారం తీసుకొని అలప్పుజలోని జేమ్స్ ఇంటికి వచ్చారు.

అయితే కొల్లం నుంచి మొదట అలప్పుజ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వీరు అక్కడి నుంచి జేమ్స్ ఇంటికి వెళ్లేందుకు ప్రసన్నకుమార్ అనే వ్యక్తి ఆటో ఎక్కారు. అదే ఆటోలో వారు ఇంటికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ వాళ్లను దిలేసి తిరిగి వెళ్లిపోయాడు. అయితే అనీష్, నయన ఇంట్లోకి వెళ్లిన కాసేపటికి తాము తీసుకొచ్చిన బంగారం బ్యాగ్‌ను వెతికారు. కనిపించకపోవడంతో ఆటోలో మర్చిపోయినట్టు గుర్తుతెచ్చుకున్నారు. దీంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ సహాయంతో ఆటోను కనిపెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అయితే తన ప్రయాణం ముగించుకుని దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి ప్రసన్నకుమార్.. ఆటోను పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఆటో వెనక సీట్‌లో బ్యాగ్‌ను గుర్తించాడు. దాన్ని తీసి చూడగా అందులో బంగారం ఉండడాన్ని గమనించాడు. నష్టం వల్ల కలిగే బాధను గ్రహించిన ప్రసన్నకుమారు. క్షణం కూడా ఆలోచించకుండా వాళ్లను దించిన ఇంటికి చేరుకున్నాడు. పెళ్లి ఇంటికి చేరుకొని వాళ్లకు బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను అందించాడు. దీంతో ఒక్కసారిగా పెళ్లింటి వారంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. ఆగిపోతుందన్న పెళ్లిన నిలబెట్టినందుకు వారంత ప్రసన్నకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్న జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.