టీవీ9 నెట్‌వర్క్, శ్రీరామ్ ఫైనాన్స్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న హైవే హీరోస్ రెండో సీజన్ ప్రోగ్రాంలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా మాట్లాడారు. హైవే హీరోలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో మరింత సమ్మిళితమైన, సురక్షితమైన రవాణా వ్యవస్థను నిర్మించడానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారన్నారు. గత దశాబ్దకాలంలో భారతదేశ మౌలిక సదుపాయాల్లో.. రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో, కేంద్రమంత్రి నితిన్ గడ్కరి మార్గదర్శకత్వంలో 60,000 కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించామని.. ఇది జాతీయ కనెక్టివిటీ, ఆర్థిక ఏకీకరణను గణనీయంగా పెంచిందని ఆయన పేర్కొన్నారు.
ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే పలు ప్రధాన ఎక్స్‌ప్రెస్ హైవేల గురించి కేంద్ర సహాయమంత్రి హర్ష్ మల్హోత్రా వివరించారు. భారతదేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణ సమయాన్ని 2.5 గంటల నుంచి కేవలం 45 నిమిషాలకు తగ్గిస్తుంది. ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అమృత్‌సర్–జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌వే, బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే వంటి ఇతర ప్రాజెక్టుల అభివృద్ధి గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. ఇవన్నీ కూడా వేగవంతమైన, సురక్షితమైన, సమర్ధమంతమైన ప్రయాణానికి దోహదపడతాయి.
2014లో రోజుకు 12 కి.మీ.లుగా ఉన్న హైవే నిర్మాణ వేగం.. ఆ తర్వాత రోజుకు 30 కి.మీ.లకు పెరిగిందని మల్హోత్రా పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలలో NHAI అభివృద్ధి పనులు 45 కోట్ల ప్రత్యక్ష ఉపాధి దినాలు, 57 కోట్ల పరోక్ష ఉపాధి దినాలు, 532 కోట్ల ప్రేరేపిత ఉపాధి దినాలను సృష్టించాయని కేంద్రమంత్రి అన్నారు. విక్‌సిత్ భారత్ @2047 లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విధాన, పర్యావరణ, లాజిస్టికల్ అడ్డంకులను పరిష్కరించడంలో MoRTH పాల్గొనడం గురించి మంత్రి ప్రస్తావించారు.
భారతదేశం అంతటా దాదాపు 800 ఇథనాల్ ఉత్పత్తి ప్రాజెక్టులు జరుగుతున్నాయని.. E20 లక్ష్యం కింద ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు హర్ష్ మల్హోత్రా అన్నారు. హైవే నిర్మాణం వల్ల కలిగే కాలుష్యం గురించి మంత్రి చెప్పారు. నిర్మాణ పరికరాలు, ట్రాక్టర్ల కోసం MoRTH భారత్ స్టేజ్(CEV/Trem)-V ఉద్గార ప్రమాణాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. MoRTH సుమారు 14,000 బ్లాక్ స్పాట్‌లను సరిచేసిందని పేర్కొన్నారు. ఇంకా, భద్రతా ఆడిట్‌లు, మెరుగైన సంకేతాలు, పాదచారుల మౌలిక సదుపాయాలు, హైవే డిజైన్‌ను సరిచూడటం లాంటివి చేశామన్నారు. భారతదేశపు హైవే హీరోలు అంటే మన ట్రక్ డ్రైవర్లు.. దేశ లాజిస్టిక్స్ రంగానికి వెన్నెముకలా ఉన్నారు. మన హైవే హీరోల శ్రేయస్సుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు.
MoRTH డ్రైవర్ శిక్షణ సంస్థలు, పునశ్చరణ కార్యక్రమాల ద్వారా నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టిందని మల్హోత్రా పేర్కొన్నారు. ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాలలో తప్పనిసరి బీమా కవరేజ్.. అలాగే ప్రమాదం తర్వాత కీలకమైన గోల్డెన్ అవర్ సమయంలో రూ. 1.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందించే నగదు రహిత చికిత్స పథకం-2025ను అమలులోకి తీసుకొచ్చామన్నారు.
Delighted to address the 2nd edition of TV9 Network: Highway Heroes in Delhi and felicitate our unsung heroes(truck drivers) who keep India moving an initiative by @ShriramGroup and @TV9Bharatvarsh 🚛🇮🇳
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi… pic.twitter.com/jf22Ssyjmj
— Harsh Malhotra (@hdmalhotra) July 14, 2025