AP Govt Stop Welfare Schemes For Those People: ఏపీలో వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలిపివేసే ఆలోచనలో ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారికి పథకాలు రావన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. గతంలో 20 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరిగేదని, ప్రస్తుతం అది 90 ఎకరాలకు తగ్గిందని వివరించారు. గిరిజనులకు ఉపాధి కల్పించడానికి పండ్ల మొక్కలు ఇవ్వాలని నిర్ణయించామని ఆమె పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం త్వరలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు.
హైలైట్:
- ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- వారందరికి సంక్షేమ పథకాలు కట్
- వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు

‘ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేశారు. దీనిలో 150 షాపులను మూసివేశారు. ఒడిశా నుంచి వచ్చే రైళ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈగల్ బృందాలు, రైల్వేశాఖ కలిసి తనిఖీలు చేశాయి. ఆరుగురిని అరెస్టు చేసి 37 కిలోల గంజాయి, 152 గంజాయి చాక్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు ఒకప్పుడు గంజాయికి హబ్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడ మంచి కాఫీని పండిస్తున్నారు. ఈగల్ టాస్క్‌ఫోర్స్ ద్వారా ఏజెన్సీలో 325 హాట్ స్పాట్‌లను గుర్తించాము. గిరిజనుల జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయ పంటల సాగుకు సహాయం చేస్తున్నాము. ఎక్సైజ్ ఆదాయంలో 2% ఈగల్ విభాగానికి కేటాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది’ అన్నారు.
ఏపీ హోంమంత్రి అనితకు ఊహించని అనుభవం
గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం త్వరలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు ఈగల్ ఐజీ రవికృష్ణ. ‘విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు గతంలో గంజాయి హబ్‌గా పేరు ఉంటే.. ఇప్పుడు అత్యుత్తమమైన కాఫీకి బ్రాండ్‌గా మారుతున్నాయి. త్వరలో ఆపరేషన్ గరుడ 2 మొదలవుతుంది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వాడినా, అమ్మినా 1972కు సమాచారం ఇస్తే 24గంటలు ఈగల్ సిబ్బంది అందుబాటులో ఉండి చర్యలు తీసుకుంటారు’ అని వివరించారు.