Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

15 బంతుల్లో 5 వికెట్లు.. కట్‌చేస్తే.. 78 ఏళ్ల రికార్డ్ బద్దలు.. క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి ఇలా..

15 July 2025

చిన్న చిన్న ఆకులు.. ఇవేం చేస్తాయ్ అనుకునేరు.. వందలాది వ్యాధులకు మొనగాడి మెడిసిన్

15 July 2025

శివాలయానికి క్యూ కట్టిన ముస్లిం భక్తులు..! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

15 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Sitanagaram Talliki Vandanam Money Sisters Request,’తల్లికి వందనం డబ్బులు మా అమ్మకు కాదు నాన్నకు ఇవ్వండి.. ఈ అక్కాచెల్లెళ్ల కథ వింటే! – two sisters requested mpdo to give talliki vandanam scheme money should give to father instead of mother in east godavari district
ఆంధ్రప్రదేశ్

Sitanagaram Talliki Vandanam Money Sisters Request,’తల్లికి వందనం డబ్బులు మా అమ్మకు కాదు నాన్నకు ఇవ్వండి.. ఈ అక్కాచెల్లెళ్ల కథ వింటే! – two sisters requested mpdo to give talliki vandanam scheme money should give to father instead of mother in east godavari district

.By .15 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Sitanagaram Talliki Vandanam Money Sisters Request,’తల్లికి వందనం డబ్బులు మా అమ్మకు కాదు నాన్నకు ఇవ్వండి.. ఈ అక్కాచెల్లెళ్ల కథ వింటే! – two sisters requested mpdo to give talliki vandanam scheme money should give to father instead of mother in east godavari district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Sitanagaram Talliki Vandanam Money To Father: తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు వింత కోరికతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వం విడుదల చేసిన ‘తల్లికి వందనం’ డబ్బులు తమ తల్లికి కాకుండా తండ్రికి ఇవ్వాలని వారు కోరుతున్నారు. కారణం వారి తల్లిదండ్రులు విడిపోయి ఉండటమే. కాలు పనిచేయకపోయినా తమ తండ్రి తమను పోషిస్తున్నాడని, ఆ డబ్బులు ఆయనకు ఉపయోగపడతాయని వారు ఎంపీడీవోను వేడుకున్నారు. మరి ఈ విచిత్ర పరిస్థితికి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

హైలైట్:

  • తల్లికి వందనం డబ్బులు తండ్రికి ఇవ్వండి
  • మా అమ్మకు తల్లికి వందనం డబ్బులివ్వొద్దు
  • ఎంపీడీవోను కలిసి వినతి పత్రం ఇచ్చారు
తల్లికి వందనం నాన్నకు ఇవ్వండి
తల్లికి వందనం నాన్నకు ఇవ్వండి (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేసింది.. ఒక్కో విద్యార్థికి రూ.13వేల చొప్పున తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేసింది. అయితే తల్లికి వందనం డబ్బులు తల్లుల ఖాతాలకు వేస్తే.. ఈ ఇద్దరమ్మాయిలు మాత్రం తల్లికి వందనం డబ్బుల్ని తన తండ్రికి ఇవ్వాలని కోరుతున్నారు. తమ తండ్రికి ఆ డబ్బుల్ని ఇచ్చేలా చూడాలని ఎంపీడీవోను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. సీతానగరం బొబ్బిల్లంకకు చెందిన చిత్రపు సంధ్యన, సునైనాలు అక్కాచెల్లెళ్లు.. వారిద్దరు ఊరిలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో పది, తొమ్మిది తరగతులు చదువుతున్నారు. వీరిద్దరు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు.. సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఒక ఫిర్యాదును అందజేశారు. తమకు ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం డబ్బులు రూ.26వేలను.. తమ తండ్రికి ఇవ్వాలని ఎంపీడీవోకు అర్జీ అందజేశారు. తమ తల్లికి కాకుండా తండ్రికి తల్లికి వందనం డబ్బులు ఇవ్వమని ఎందుకునే అనుమానం రావొచ్చు. అందుకు కారణాలను కూడా అక్కాచెల్లెళ్లు చెప్పారు.

తమ తండ్రి చిత్రపు అబ్బులు, అలాగే తల్లి కొన్ని కారణాలతో విడిపోయి ఉంటున్నారని అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు. అప్పటి నుంచి తాము తండ్రి సంరక్షణలో ఉంటున్నామన్నారు. కాలు పనిచేయకపోయినా సరే తన తండ్రి ఉపాధి పనులు చేసుకుంటూ తమ ఇద్దర్నీ చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి, ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం డబ్బులు తమ తల్లి ఖాతాలో పడుతున్నాయని గుర్తు చేశారు.. ఆ డబ్బులు తమ తల్లి తీసుకుందంటున్నారు.

Thalliki vandanam status check: తల్లికి వందనం రాలేదా, అకౌంట్లో డబ్బులు పడలేదా, ఏం చేయాలంటే?

తమకు స్కూల్లో ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం, బుక్స్, యూనిఫామ్ వంటి సౌకర్యాలతో చదువుకోగలుగుతున్నామన్నారు అక్కాచెల్లెళ్లు సంధ్యన, సునైనా. తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న పూరి పాకలో వర్షం వస్తే నీరు కారిపోయే స్థితిలో ఉంటూ చదువుతున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బులు తమ తండ్రికి ఇస్తే తమ అవసరాలు తీర్చుకుంటామని చెప్పినా తమ తల్లి వినడం లేదన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి.. తల్లి పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ నిలిపివేయాలని కోరారు. తమను కంటికి రెప్పలా చూసుకుంటున్న తమ మంత్రి పేరున తల్లికి పథకం వర్తింపజేయాలని కోరారు. వీరిద్దురు ఎంపీడీవో కార్యాలయంలో మాత్రమే కాదు పీజీఆర్‌ఎస్‌, సీతానగరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఈ అంశంపై మరో వినతిపత్రం అందజేశారు. మరి ఈ అక్కాచెల్లెళ్ల సమస్యను ప్రభుత్వ అధికారులు ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తల్లికి వందనం డబ్బుల్ని తల్లికి కాకుండా తండ్రి అకౌంట్‌లో వేయమని కోరవడం చర్చనీయాంశమైంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి