నిజానికి చెమట ఒక్కటే అంత దుర్వాసనను కలిగించదు. బ్యాక్టీరియా దానితో కలిసినప్పుడే ఇలా జరుగుతుంది. కాబట్టి తల నుంచి కాలి వరకు, శరీరంలోని అన్ని భాగాలను సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా ప్రతిచోటా పేరుకుపోతుంది. ముఖ్యంగా చంకలలో, వేళ్ల మధ్య, బ్యాక్టీరియా నివసిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాలను బాగా కడిగి స్నానం చేయాలి. వీలైతే, మంచి డియోడరెంట్లు లేదా తడి తొడుగులు ఉపయోగించడం చాలా మంచిది.
ఏ రకమైన ఉత్పత్తులు వాడటం మంచిది?
శరీర దుర్వాసనను నివారించడానికి కొందరు వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా బాడీ వాష్‌లకు ఎక్కువ వినియోగిస్తుంటారు. అయితే కొన్ని బాడీ వాష్‌లు శరీర దుర్వాసనను తగ్గించగలవు. కానీ ఇవి బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించవు. అందుకే స్నానం చేసిన తర్వాత వచ్చే దుర్వాసనను వదిలించుకోవడానికి మీరు సరైన ఉత్పత్తులను ఎంచుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా యాంటీ బాక్టీరియల్ క్లెన్సర్‌లను ఉపయోగించడం మంచిది. ఇవి బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి, శరీర దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి.
శుభ్రం చేయకుండా దుస్తులు ధరించకూడదు..
తువ్వాళ్ల విషయంలో చాలా మంది కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు. వారు రోజంతా ఒకే తువ్వాలను ఉపయోగిస్తారు. కొందరు నెలలపాటు శుభ్రం తువ్వాళ్లే కాదు.. బట్టలు, లోదుస్తులు, ఇతర ఉపయోగించిన దుస్తులను ఉతకకుండానే తిరిగి మళ్లీమళ్లీ ఉపయోగిస్తుంటారు. ఇవి పైకి శుభ్రంగా కనిపించినప్పటికీ, వాటిలో బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. ఇవి రోజురోజుకూ పెరుగుతాయి. ఒకే టవల్, దుస్తులను పదే పదే ఉపయోగించడం వల్ల శరీర దుర్వాసన మరింత పెరుగుతుంది. అలాగే బిగుతుగా ఉండే దుస్తులు, సింథటిక్ దుస్తులను వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఉపయోగించిన దుస్తులను మళ్ళీ ఉపయోగించే ముందు ఉతకడం మంచిది.
ఇవి కూడా చదవండి
హార్మోన్ల సమస్యలు
కొంతమంది వ్యక్తులలో కనిపించే హార్మోన్ల సమస్యలు కూడా అధిక శరీర దుర్వాసనకు కారణమవుతాయి. ఈ సమస్య ముఖ్యంగా హైపర్ హైడ్రోసిస్, అంటే అధిక చెమట వంటి పరిస్థితులలో స్పష్టంగా కనిపిస్తుంది. అదనంగా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఈ సమస్యను కలిగిస్తాయి. అంతేకాకుండా, కొన్ని మందులు కూడా అసహ్యకరమైన వాసనను కలిగిస్తాయి. అంతేకాకుండా, మనం రోజూ తీసుకునే ఆహారాలు కూడా ఈ రకమైన సమస్యకు కారణమవుతాయి. వెల్లుల్లి, ఉల్లిపాయలు మరియు అధిక ఆల్కహాల్ వినియోగం మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కూడా చెమటను కలిగిస్తాయి, ఇది చెడు శరీర దుర్వాసనకు దారితీస్తుంది. ఈ విధంగా, కొన్ని విషపూరిత పదార్థాలు చెమట ద్వారా విడుదలవుతాయి, ఇది దుర్వాసనకు కారణమవుతుంది.
మరైతే ఏం చేయాలి?
వారానికి కనీసం రెండుసార్లు మృదువైన బ్రష్ లేదా స్పాంజితో మీ చేతులు, కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత నీరు లేకుండా తువ్వాలతో శరీరాన్ని సరిగ్గా ఆరబెట్టాలి. ఎందుకంటే శరీరంలోని ఏ భాగంలోనైనా తేమ ఉంటే, అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే, మీరు వాడుతున్న సబ్బుతో ఎటువంటి మార్పు లేకపోతే, వెంటనే వేరే సబ్బును ప్రయత్నించండి. సరైన డియోడరెంట్‌ను ఎంచుకోండి. మూత్రం ద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లేందుకు వీలుగా.. చెమట వాసన తగ్గడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. అలాగే మీరు తినే ఆహారం పట్ల కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. వంటల్లో వెల్లుల్లి, ఉల్లిపాయల వినియోగాన్ని కొద్దిగా తగ్గించడం మంచిది.
మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్ చేయండి.