Justice Devanand Battu: జస్టిస్ బట్టు దేవానంద్ తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. రాష్ట్రపతి ఆమోదంతో మద్రాస్ హైకోర్టు నుండి ఆయన తిరిగి వస్తున్నారు. త్వరలో ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన 2028 వరకు పదవిలో ఉంటారు. జస్టిస్ దేవానంద్ గతంలోనూ ఇక్కడ పనిచేసి, ఆ తర్వాత బదిలీ అయ్యారు. మళ్ళీ సొంత గూటికి చేరడంతో న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన రాకతో హైకోర్టు మరింత బలోపేతం కానుంది.
హైలైట్:
- ఏపీ హైకోర్టుకు జస్టిస్ బట్టు దేవానంద్
- మద్రాసు హైకోర్టు నుంచి బదిలీ చేశారు
- ఆయన సోదరుడు ఏపీలో ఆ జిల్లా కలెక్టర్

జస్టిస్ బట్టు దేవానంద్ కృష్ణా జిల్లా గుడివాడలో 1966 ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బట్టు వెంకటరత్నం, మనోరంజితం ప్రభుత్వ ఉపాధ్యాయులు. దేవానంద్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1989 జులై 6న బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని విశాఖపట్నం జిల్లా కోర్టులో ప్రాక్టీసు చేసిన అనంతరం హైకోర్టుకు మార్చారు. 1996 నుంచి 2000 వరకు ఏపీ హైకోర్టులో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా.. 2006లో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు.
టీచర్‌గా మారిన చంద్రబాబు.. పిల్లలకు పాఠాలు.. లోకేష్ కూడా శ్రద్ధగా
2014 జులై నుంచి 2019 మే వరకు ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. 2020 జనవరి 13న జస్టిస్ దేవానంద్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.. 2023 ఏప్రిల్ 10న మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ దేవానంద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు.. ఆయన సోదరుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రస్తుతం విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు.