ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న ఫ్యాషన్ బ్లూ జీన్స్ అని చెప్పవచ్చు. ఇది స్టైలిష్ గా కనిపిస్తుంది. కనుక చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎక్కువ మంది దీనిని ధరించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒక దేశంలో, జీన్స్ ధరించి బయట తిరిగితే జైలులో పెట్టడం గ్యారెంటీ. ఎందుకంటే ఆ దేశంలో జీన్స్ నిషేధించారు. ప్రపంచంలో వివిధ కారణాల వల్ల యుద్ధాలు జరుగుతుండగా.. ఉత్తర కొరియా మాత్రం తమ ప్రజలపై జీన్స్‌పై యుద్ధం చేస్తోంది. ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన సాగుతుందని తెలిసిందే. అతను చెప్పేది వినడం.. అతను చెప్పే నియమాలను పాటించడం తప్పనిసరి. ఎన్నో రకాల సంచలన నిర్ణయాలు తీసుకుని ప్రజలపై వాటిని రుద్దే కిమ్ జోంగ్ ఇప్పుడు జీన్స్‌ను నిషేధించాడు. ఎవరైనా నీలిరంగు జీన్స్ ధరించి వీధిలో నడిస్తే.. వారిని పోలీసులు పట్టుకుని జైలులో పెడతారని పేర్కొన్నాడు. నీలిరంగు జీన్స్ ధరించడం అక్కడ పెద్ద నేరంగా ప్రకటించాడు కిమ్.
ఉత్తర కొరియా కఠినమైన నియమాలు, నియంతృత్వానికి ప్రసిద్ధి చెందిన దేశం. ఎందుకంటే ఆ దేశాన్ని ఏలే నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికన్ వ్యతిరేకి. కనుక ఆ దేశంలో నీలిరంగు జీన్స్ ధరించడం నిషేధించబడింది. ఎందుకంటే ‘నీలిరంగు జీన్స్’ అమెరికన్ సంస్కృతి, సామ్రాజ్యవాదానికి చిహ్నం. దుస్తు కోడ్ కేవలం ఒక చట్టం కాదు. ఇది ఒక భావజాలంలో భాగం. ఎవరైనా పొరపాటున నీలిరంగు జీన్స్ ధరిస్తే, వారిని జైలుకు పంపుతారు. ఆ దేశంలో ప్రభుత్వం ప్రజలు ధరించే దుస్తులను మాత్రమే కాదు ప్రజల ఆలోచనలను కూడా నియంత్రిస్తుంది. ఏ దుస్తులు ధరించాలి, ఏ హెయిర్ స్టైల్ ఉండాలి. ఏ రంగు సముచితమో, ఇవన్నీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎవరూ నియమాలను ఉల్లంఘించడానికి అవకాశం ఉండదు. ఇక్కడి పోలీసులు ప్రజల ఫ్యాషన్‌పై చాలా శ్రద్ధ చూపిస్తారు.
నీలిరంగు జీన్స్ దుకాణాల్లో అమ్మినా, దుకాణ యజమానికి జరిమానా విధించబడుతుందని పేర్కొన్నాడు కిమ్. అమెరికాకు సంబంధించిన ఏవైనా వస్తువులు ఉపయోగించ రాదని, చారాలు తన దేశంలో పాటించరాదని .. ఒకవేళ పాటిస్తుంటే వాటిని వెంటనే నిలిపివేయాలని కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. అమెరికన్ బ్రాండ్ షర్టులు, హెయిర్ డైలు, లెదర్ జాకెట్లు కూడా నిషేధించబడ్డాయి. మొత్తం ప్రపంచానికి ఫ్యాషన్‌లో స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. ఉత్తర కొరియాలో మాత్రమే ఇది సమాజాన్ని నియంత్రించే మార్గం ఉంటుంది. బట్టలు అంటే అక్కడి యువతకు ధరించే బట్టలు మాత్రమే కాదని.. ప్రభుత్వ ఆదేశాలు అని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీసింది.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..