భారత్ సరికొత్త రికార్డు సాధించింది. పెట్టుకున్న లక్ష్యాన్ని ఐదేళ్ల ముందుగానే సాధించి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచింది. ఇండియా మొత్తం 484.8 గిగా వాట్ స్థాపిత సామర్థ్యంలో 242.8 గిగ్ వాట్ శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 శాతం సాధించింది. 2030 నాటికి దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని ఐదు సంవత్సరాలు ముందుగానే సాధించిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం తెలిపారు. దేశంలో శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అంతర్జాతీయ వేదికలలో భారతదేశం నిబద్ధత చాటి చెబుతోంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఒక ప్రధాన వాతావరణ నిబద్ధత నెరవేరింది. భారతదేశం మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 484.8 GW కాగా.. అందులో 242.8 GW శిలాజేతర ఇంధన వనరుల నుండి వస్తోంది. ఇది మన పర్యావరణ పురోగతికి శక్తివంతమైన నిదర్శనం. ఇది కేవలం ఒక మైలురాయి కాదు – 2047 నాటికి పర్యావరణ అనుకూల, పరిశుభ్రమైన భారత్ వైపు ఒక పెద్ద అడుగు” అని జోషి పేర్కొన్నారు. భారత్‌లో బొగ్గు నుంచి ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందనే విషయం తెలిసిందే. థర్మల్ విద్యుత్ వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతోంది. దాన్ని తగ్గించే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం సోలార్, పవన విద్యుత్ సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టింది.
In a world seeking climate solutions, India is showing the way.
Achieving 50% non-fossil fuel capacity five years ahead of the 2030 target is a proud moment for every Indian.
Hon’ble PM Shri @narendramodi ji’s leadership continues to drive Bharat’s green transformation — paving… pic.twitter.com/ydzWErWQNC
— Pralhad Joshi (@JoshiPralhad) July 14, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి