Talliki Vandanam Scheme 2025 2nd Payment Status Check: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద మొదటి విడత డబ్బులు విడుదల చేసింది. రెండో విడతకు అర్హుల జాబితాను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల ఆధార్ నంబర్ ద్వారా పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.కొన్ని సమస్యల కారణంగా అనర్హులైన వారి సమస్యలను పరిష్కరించి రెండో జాబితాలో చేర్చారు. ఇంకా సమస్యలుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు.
హైలైట్:
- తల్లికి వందనం పథకం రెండో జాబితా
- ఆ నంబర్‌తోనూ స్టేటస్ తెలుసుకోండి
- ట్రాక్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ ఎనేబుల్

Thalliki vandanam status check: తల్లికి వందనం రాలేదా, అకౌంట్లో డబ్బులు పడలేదా, ఏం చేయాలంటే?
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి డబ్బులు జమ చేస్తామని తెలిపింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తామని చెప్పింది. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ప్రకటించగా.. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం రూ.2వేలు మినహాయించుకుని ఒక్కో విద్యార్థికి రూ.13వేలు చొప్పున డబ్బుల్ని తల్లుల అకౌంట్‌లలో జమ చేశారు. అయితే కొందరు విద్యార్థులకు.. భూమి ఎక్కువగా ఉందని, నాలుగు చక్రాల వాహనం ఉందని, కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని, హౌస్ మ్యాపింగ్‌లో సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే ఇలా పలు సమస్యలతో తల్లికి వందనం పథకానికి అనర్హులయ్యారు. అయితే కొందరు విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించి రెండో జాబితాలో చేర్చారు. అయితే ఇప్పటికీ కొందరికి ఈ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్యల్ని పరిష్కరించి తమకు కూడా తల్లికి వందనం పథకం డబ్బులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.