Mitchell Starc, AUS vs WI: కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఓ చారిత్రాత్మక రికార్డును సృష్టించాడు. తన టెస్ట్ కెరీర్‌లో తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ, స్టార్క్ విండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను నాశనం చేశాడు. అతను 6 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌ను కేవలం 27 పరుగులకే ఆలౌట్ చేశాడు. ఇది చరిత్రలో రెండవ అత్యల్ప స్కోరు. ఈ ఇన్నింగ్స్‌లో అతని అద్భుతమైన బౌలింగ్‌తో పాటు ప్రపంచ రికార్డును కూడా సృష్టించాడు.
ఆ ప్రపంచ రికార్డ్ ఎక్కడంటే?
స్టార్క్ కేవలం 15 బంతుల్లోనే 5 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 4 సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తన మొదటి ఓవర్ మొదటి బంతికే వెస్టిండీస్ ఓపెనర్‌ను అవుట్ చేశాడు. ఇది ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడిని పెంచింది. ఆ తర్వాత నిరంతరం వికెట్లు పడగొట్టాడు. త్వరలోనే కేవలం 15 బంతుల్లోనే ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా కొత్త రికార్డును సృష్టించాడు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో అతను ఈ రికార్డును సృష్టించాడు.
78 ఏళ్ల రికార్డును బద్దలు..
The historians had their hands full, with record after record toppling today.
Which stat blew your mind?#WIvAUS pic.twitter.com/te8AWIJZI4
— cricket.com.au (@cricketcomau) July 15, 2025
అంతకుముందు, ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన ఎర్నీ టోషాక్ (1947లో భారత్‌పై), ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ (2015లో ఆస్ట్రేలియాపై), ఆస్ట్రేలియాకు చెందిన స్కాట్ బోలాండ్ (2021లో ఇంగ్లాండ్‌పై) పేరిట ఉంది. వీరు ఒక్కొక్కరు 19 బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టారు. స్టార్క్ ఈ దిగ్గజాలందరినీ వదిలి 78 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
టెస్టుల్లో 400 వికెట్ల మార్క్ పూర్తి..
ఈ చారిత్రాత్మక ప్రదర్శనతో, స్టార్క్ ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపించడమే కాకుండా, తన టెస్ట్ కెరీర్‌లో 400 వికెట్లు కూడా పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా తరపున 400 టెస్ట్ వికెట్లు తీసిన నాల్గవ బౌలర్‌గా అతను నిలిచాడు. గ్లెన్ మెక్‌గ్రాత్ తర్వాత ఆస్ట్రేలియా తరపున ఈ ఘనత సాధించిన రెండవ ఫాస్ట్ బౌలర్ అతను. తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో, స్టార్క్ డేంజరస్ బౌలింగ్ మొత్తం వెస్టిండీస్ జట్టును కేవలం 27 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇది టెస్ట్ క్రికెట్‌లో ఏ జట్టు చేసిన రెండవ అత్యల్ప స్కోరుగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..